Best Web Hosting Provider In India 2024

OTT Releases This Week: డిసెంబర్ నాలుగో వారంలో మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో స్ట్రీమింగ్కు రానున్నాయి. ఓటీటీల్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఆదికేశవ సినిమా కూడా ఇదే వారంలో ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అలాగే, హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బార్బీ.. మరో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్కు రానున్న ముఖ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.
ట్రెండింగ్ వార్తలు
నెట్‌ఫ్లిక్స్
ఆదికేశవ: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అనుకున్న స్థాయిలో హిట్ కాలేకపోయింది. ఇప్పుడు, ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తోంది.
- మాస్ట్రో – వెబ్ సిరీస్ – డిసెంబర్ 20 – నెట్‌ఫ్లిక్స్
- కర్రీ అండ్ సెనైడ్ – వెబ్ సిరీస్ – డిసెంబర్ 22 – నెట్‌ఫ్లిక్స్
- రెబల్ మూన్: పార్ట్ వన్ – సినిమా – డిసెంబర్ 22 – నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో
సప్తసాగర దాచె ఎల్లో సైడ్ బీ: కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వంసత్ హీరోహీరోయిన్లుగా నటించిన లవ్ ఎమోషనల్ మూవీ సప్త సాగరదాచే ఎల్లో సైడ్-బీ (తెలుగులో సప్తసాగరాలు దాటి-సైడ్ బీ) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుంది. డిసెంబర్ 22న ఈ చిత్రం స్ట్రీమింగ్కు వస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఫ్లేమ్స్ సీజన్ 4 – వెబ్ సిరీస్ – డిసెంబర్ 21 – అమెజాన్ ప్రైమ్ వీడియో
డ్రై డే – సినిమా – డిసెంబర్ 22 – అమెజాన్ ప్రైమ్ వీడియో
సాల్ట్ బర్న్ – సినిమా – డిసెంబర్ 22 – అమెజాన్ ప్రైమ్ వీడియో
మిషన్ స్టార్ట్ ఏబీ: కాంపిటేటివ్ రియాలిటీ సిరీస్ – డిసెంబర్ 19 – అమెజాన్ ప్రైమ్ వీడియో
జియో సినిమాలో బార్బీ
బార్బీ: ఈ ఏడాది హాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సూపర్ హిట్ అయిన ‘బార్బీ’ మూవీ జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో డిసెంబర్ 21న స్ట్రీమింగ్కు రానుంది.
డిస్నీ+ హాట్‌స్టార్
- బీటీఎస్ మాన్యుమెంట్స్: బియాండ్ ది స్టార్స్ – డాక్యుసిరీస్ – డిసెంబర్ 20 – డిస్నీ+ హాట్‌స్టార్
- పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ – సిరీస్ – డిసెంబర్ 20 – డిస్నీ+ హాట్‌స్టార్
- వాట్ ఇఫ్ సీజన్ 2– వెబ్ సిరీస్ – డిసెంబర్ 22 – డిస్నీ+ హాట్‌స్టార్
- హ్యూమరస్లీ యువర్స్ సీజన్ 3 – సిరీస్ – డిసెంబర్ 22 – జీ5
మనోజ్‌తో సిద్ధు హంగామా
ఈటీవీ విన్ ఓటీటీలో హీరో మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ గేమ్ షో రెండో ఎపిసోడ్ డిసెంబర్ 21న స్ట్రీమింగ్కు రానుంది. ఈ ఎపిసోడ్‌కు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గెస్టుగా రానున్నారు.
టాపిక్