Prabhas: ప్రభాస్‌కు వందల కోట్ల ఆస్తులు.. బాహుబలి రేంజ్‌లో లైఫ్ స్టైల్.. 8 ఏళ్లలో మారిన లెక్కలు?

Best Web Hosting Provider In India 2024

Prabhas Lifestyle: పాన్ ఇండియా ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. డిసెంబర్ 22న సలార్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినీ కెరీర్‌ను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని నిర్వచించవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు

బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా

తండ్రి గోపికృష్ణ మూవీస్ బ్యానర్ నిర్మాణ సంస్థ, పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టార్ ఫ్యామిలీ నుంచి వారసుడిగా ప్రభాస్ సినిమాల్లోకి తెరంగేట్రం చేశాడు. కానీ, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొదటి సినిమా ఈశ్వర్‌కే ఉపయోగపడింది. అనంతరం ఎంతో కష్టపడి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

150 కోట్ల పారితోషికం

2014-15 అంటే బాహుబలి రెండు చిత్రాలకు ముందు ప్రభాస్ రెమ్యునరేషన్ చాలా తక్కువ. అప్పుడు ప్రభాస్ నెట్ వర్త్ సుమారు రూ. 124 కోట్లు (15 మిలియన్ డాలర్స్)గా ఉన్నట్లు అంచనా. బాహుబలి తర్వాత ప్రభాస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు ప్రభాస్.

తొలి నటుడిగా

ప్రభాస్ ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే తొలి భారతీయుడిగా నిలిచాడు. అలాగే రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి నటుడిగా రికార్డుకెక్కాడు. ప్రభాస్ ఆదిపురుష్ కోసం రూ. 100 నుంచి 120 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ కోసం రూ. 150 కోట్లు, ఇప్పుడు సలార్‌కు రూ. 100 కోట్లతో పాటు లాభాల్లోంచి 10 శాతం తీసుకోనున్నాడట.

 

8 ఏళ్లల్లో 94 శాతం

ఇలా 8 సంవత్సరాలలో పారితోషికం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో ప్రభాస్ నెట్‌వర్త్ ఊహించని విధంగా 94 శాతం వరకు పెరిగిపోయిందని సమాచారం. దీంతో ప్రభాస్ నికర ఆస్తి విలువ రూ. 241 కోట్లుగా (29 మిలియన్ డాలర్స్/2410 మిలియన్ నెట్‌వర్త్) ఉండనుందని అంచనా. దీనికి తగినట్లే ప్రభాస్ లైఫ్ స్టైల్ కూడా ఉందని తెలుస్తోంది.

విలాసవంతమైన ఫ్లాట్స్

ప్రభాస్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీబిల్స్‌లో రూ. 60 కోట్ల విలువైన ఇల్లు ఉందని లైఫ్ స్టైల్ ఏషియా పేర్కొంది. అలాగే, హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గ్ ఖల్సాలో ఫామ్ హౌజ్ ఉందట. ఇటలీలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ ఉందని, హాలీడే లేనప్పుడు దానికి వచ్చే అద్దె రూ. 4.8 కోట్లు ఉంటుందని సమాచారం. వీటితోపాటు ప్రభాస్ వద్ద ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

కోట్ల విలువ చేసే కార్లు

రూ. కోటి విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ. 2 కోట్ల విలువగల బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, 2 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్‌‌తోపాటు రూ. 8 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ప్రభాస్ వద్ద ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ నిజమైన బాహుబలి మాత్రమే కాదు.. ఆయన లైఫ్ స్టైల్ కూడా అదే బాహుబలి రేంజ్‌లో ఉందని టాక్ నడుస్తోంది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *