ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల(పేరకలపాడు) :
ది.15-7-2022(శుక్రవారం) ..
గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం – రైతు భరోసా కేంద్రం – వైయస్సార్ హెల్త్ క్లినిక్ ..
కంచికచర్ల మండలం లోని పేరకలపాడు గ్రామంలో రూ.40 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుక్రవారం అధికారులతో కలిసి ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా”జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువచేయడంతో పాటు, ప్రభుత్వ పాలనను కూడా ప్రజల ఇంటిముందుకే తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు, గతంలో లాగా ప్రజలు తహసిల్దార్ కార్యాలయాలకు, మండల కేంద్రాలకు తిరిగే పనిలేకుండా తమ గ్రామంలోనే ప్రభుత్వం అందించే దాదాపు 715 రకాల సేవలను వినియోగించుకునేలా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించడం జరిగిందని తెలిపారు ,ప్రజలు దరఖాస్తు చేసుకునే ప్రతి అర్జీని నిర్ణీత కాల సమయంలోనే పూర్తి చేయాలనే ఆదేశాలతో గ్రామ సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు ,
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..