Guppedantha Manasu December 22nd Episode: శైలేంద్రను చావు దెబ్బ కొట్టిన వసుధార.. చెంప చెల్లుమనిపించి, రెండ్రోజుల గడువు

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Serial Episode 953: గుప్పెడంత మనసు సీరియల్‌లో ఎండీ సీటు నుంచి తాను తప్పుకుంటున్నట్లు వసుధార చెబుతుంది. దాంతో నిన్ను ఎవరో బెదిరిస్తున్నారు. లేకుంటే ఇంత సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవు. చెప్పు వసుధార ఎవరు నిన్ను బెదిరిస్తున్నారు అని మహేంద్ర అడుగుతాడు. నన్ను ఎవరు బెదిరించట్లేదు. రిషి సార్ వల్ల నేను స్థిమితంగా లేను అని వసుధార అంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు

శైలేంద్ర అర్హుడు

మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలియక సంజాయిషీ అడిగాం. దీనికి మీరు ఎండీ సీటు వద్దనుకోకండి. మీకు సపోర్ట్‌గా మేమున్నాం అని బోర్డ్ మెంబర్స్ అంటారు. లేదండి నేను ఈ సీటులో ఉండలేనని వసుధార అంటుంది. మరి ఈ సీటులో ఇప్పుడు కూర్చునేవారు ఎవరున్నారబ్బా అని దేవయాని అంటుంది. నా అంచనా ప్రకారం ఇప్పుడు ఎండీ సీటుకు అర్హులు ఒక్కరే ఒక్కరు. వారు శైలేంద్ర భూషణ్ గారు అని వసుధార చెబుతుంది.

దాంతో శైలేంద్ర సంతోషిస్తే.. అంతా అయిపోయిందన్నట్లుగా తల పట్టుకుంటాడు మహేంద్ర. మీరు ఓకే శైలేంద్ర ఒప్పుకుంటారా అని బోర్డ్ మెంబర్స్ అంటే.. నాకు పదవుల మీద వ్యామోహం లేదు. కానీ వసుధార నాపై నమ్మకం పెట్టుకుంది కాబట్టి నేను ఎండీ సీటులో కూర్చుందామనుకుంటున్నాను. కానీ ఒక్కటే వెలితీ నా తమ్ముడు నా పక్కన లేడు. వాడే ఇంతకుముందు ఈ సీటులో నన్ను కూర్చోబెట్టాడు అని శైలేంద్ర అంటాడు.

పదవంటే లెక్కలేదా

ఇవాళ్టీ నుంచే శైలేంద్ర ఛార్జ్ తీసుకుంటారని బోర్డ్ మెంబర్స్ అంటే.. దానికి సంబంధించిన పేపర్ వర్క్స్ చేయండి అని వసుధార వెళ్లిపోతుంది. తర్వాత అంతా వెళ్లిపోతారు. ఎండీ సీటు చూస్తూ వసుధార బాధపడుతుంది. మీరు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకోలేకపోయాను అని వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడికి వచ్చిన అనుపమ ఎందుకు అలా చేశావ్. ఎండీ పదవి అంటే లెక్కలేదా అని అంటుంది. ఆ పదవి విలువ నాకు తెలుసు అని వసుధార అంటుంది.

 

ఆ శైలేంద్ర గాడే రిషిని ఏదో చేస్తానని బెదిరించి ఉంటాడని మహేంద్ర అంటాడు. మీరు ఏమైనా అనుకోండి మావయ్య అని వసుధార అంటుంది. మరోవైపు శైలేంద్ర, దేవయాని సంతోషంగా ఉంటారు. నీ కోరిక నెరవేర్చాను మామ్. ఇంకా నాకు తిరుగులేదు. ఈ కాలేజీ అంతా నాదే. ఇక నుంచి చక్రం తిప్పుతాను అని శైలేంద్ర అంటాడు. నీ మొహం వెలిగిపోతుంటే నాకు ఎంత హాయిగా ఉందో. నా బంగారు కొండ అని దేవయాని అంటుంది.

శైలేంద్ర షాక్

వసుధార పేపర్స్ తీసుకొస్తుంది. ముందు బోర్డ్ మెంబర్స్ సంతకం పెడతారు. తర్వాత సంతకం పెట్టేందుకు వసుధార ఆలోచిస్తుంది. మంచి ముహుర్తం కోసం చూస్తున్నావా. మంచి పనులకు ముహుర్తంతో పని లేదు. సంతకం పెట్టమ్మా అని దేవయాని అంటుంది. దాంతో పెన్ వదిలేసి.. నేను సంతకం పెట్టలేనని వసుధార లేచి నిలబడుతుంది. దాంతో శైలేంద్రతోపాటు అంతా షాక్ అయి లేచి నిలబడతారు. నువ్వే కదా చేస్తానన్నావ్. చివరిలో ఇలా అంటావ్ ఏంటీ అని శైలేంద్ర అంటాడు.

ఇప్పటివరకు నేను కూడా ఎండీ సీటు మీకే ఇద్దామనుకున్నాను. కానీ, ఇందాకా మీరు అన్న మాట గుర్తుకు వచ్చి ఆగిపోయాను. రిషి సార్ సమక్షంలో ఎండీ సీటులో ఉంటే బాగుండు అన్నారు. రిషి సార్ వచ్చాకే ఆయన సమక్షంలో మీకు ఎండీ సీటు అప్పగిస్తాను అని వసుధార చావుదెబ్బ కొడుతుంది. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఏదో మాములుగా అన్నాడని దేవయాని అంటే.. లేదు బలంగానే అన్నాడు. చూడండి శైలేంద్ర సార్ సైలెంట్‌గా ఉన్నారంటే ఒప్పుకున్నట్లే అని వసుధార అంటుంది.

 

మీటింగ్ ఈజ్ ఓవర్

అవును మేడమ్. రిషి సార్ సమక్షంలో జరిగితేనే బాగుంటుంది. ఒకవేళ ఆయనకు ఇష్టం లేకుంటే అప్పుడు శైలేంద్ర సార్‌ను లేపడం బాగోదు అని బోర్డ్ మెంబర్స్ అంటాడు. ఇష్టం లేకపోవడం అంటూ ఏముండదండి. నేను ఎంత చెబితే అంతా. ఆయనకు ఇష్టమే. కానీ, రిషి సార్ రావాలి అంతే అని వసుధార అంటుంది. వసుధార చెప్పింది కూడా బాగుంది అని ఫణీంద్ర అంటాడు. ఇప్పుడు శైలేంద్రను ఎండీని చేస్తే ఏమవుతుంది అని దేవయాని అంటే.. మీటింగ్ ఈజ్ ఓవర్ అని వసుధార తెగెసి చెబుతుంది.

అనంతరం కోపంతో ఊగిపోయిన శైలేంద్ర వెళ్లి వసుధారను కలుస్తాడు. ఏంటీ నాటకాలు ఆడుతున్నావా. మనం అనుకుందేంటీ. చేసిందేంటి. రిషిని చంపేస్తానని చెప్పిన ఇలా చేశావంటే ఏంటీ అర్థం. ఇక ఊరుకోను రిషిని చంపేస్తాను అని శైలేంద్ర అంటే.. రిషి సార్ కంటే ముందు నువ్వు చచ్చిపోతావ్ అని వసుధార అంటుంది. ఏంటీ ఏం చేయగలవు నువ్వు. ఒక్క ఫోన్ చేస్తే రిషి అయిపోతాడని శైలేంద్ర అంటాడు. అలా అయితే నీ పతనానికి నువ్ దారులు వేసుకున్నట్లే అని వసుధార అంటుంది.

దిమ్మతిరిగే షాక్

ఇప్పుడు నువ్ ఇచ్చిన రిషి బ్రాస్‌లెట్ నా దగ్గర ఉంది. నీ కంట్రోల్‌లోనే రిషి సార్ ఉన్నారని అందరికీ చెబుతాను. అసలే ముకుల్ గారు నీ విషయంలో సీరియస్‌గా ఉన్నారు అని వసు అంటుంది. నువ్ చెబితే నమ్ముతార. నువ్ ఒక్కటి చెబితే నేను పది కథలు అల్లుతాను అని శైలేంద్ర అంటాడు. తెలుసు సార్. అందుకే ఈసారి పక్కా ఆధారాలతో చూపిస్తాను అని తనతో శైలేంద్ర మాట్లాడిన వీడియో చూపిస్తుంది. దీంతో శైలైంద్రకు దిమ్మతిరిగిపోతుంది.

 

వసుధారకు కొరియర్ వచ్చాకా కంగారుగా వెళ్లడం చూసిన అనుపమ జరిగినదంతా వీడియో తీసినట్లు చెప్పింది వసుధార గుర్తు చేసుకుంటుంది. డీల్ ఇచ్చాకా రిషిని ప్రాణాలతో ఉంచుతాడని గ్యారెంటీ ఏంటీ అని అనుపమ జరిగింది వసుధారకు చెబుతుంది. వీడియో చూపిస్తుంది. ఈ వీడియో ఆధారంగా శైలేంద్రను ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు అని వసుధార చెప్పడం అంతా గుర్తు చేసుకుంటుంది. ఇది నీకు ఎలా వచ్చింది అని శైలేంద్ర అడుగుతాడు.

శైలేంద్రను కొట్టిన వసు

ఎలా వస్తే ఏంటీ. వీడియో అయితే కరెక్ట్‌గానే వచ్చింది కదా అని వసుధార అంటుంది. నన్నే చీట్ చేస్తావా అని శైలేంద్ర అంటే.. చీటింగ్ గురించి నువ్ మాట్లాడకు. రిషి సార్ వస్తే ఎండీ సీటు ఇస్తానంటున్నాను. నువ్ చెప్పినట్లుగానే రిషి సార్ సమక్షంలో నువ్ ఎండీ బాధ్యతలు చేపట్టు. ఎండీ సీటు ఇచ్చాకా రిషి సార్‌ను తీసుకొస్తావని గ్యారెంటీ ఏంటీ. మోసం చేయవని నమ్మకం ఏంటీ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని వసుధార అంటుంది.

రిషిని ఇప్పుడే మట్టిలో కలిపేస్తాను అని శైలేంద్ర అంటే.. కోపంగా శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తుంది వసుధార. దాంతో శైలేంద్ర చెంపపై వసుధార చేయి అచ్చులు పడతాయి. రిషి సార్‌ను రెండ్రోజుల్లో తీసుకురాకుంటే ఈ వీడియో అందరికీ చూపిస్తాను. అప్పుడు రిషి సార్‌కు ఏదైనా జరిగితే అంతా నిన్నే అంటారు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది వసుధార.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *