Best Web Hosting Provider In India 2024

చాలా మందికి ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం అనేది చాలా ఇష్టం. ఎందుకంటే పెద్దగా రిస్క్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా ఆహారాన్ని వండడానికి సహాయపడుతుంది. వంట ఆలస్య అవ్వడం ఎందుకని ఆలోచించేవారు దీని వైపు మెుగ్గు చూపుతారు. ఆలస్యం చేసే వారికి ఇది గొప్ప ఎంపిక. ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం నిజంగా చాలా ఫ్రీగా ఉంటుంది. ఈజీగా అనిపిస్తుంది. కానీ ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని ఆహార పదార్థాలను వండటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు వస్తాయని మీకు తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
ప్రెషర్ కుక్కర్‌లో ఆహారాన్ని వండడం వల్ల కలిగే అనర్థాల గురించి గతంలో చాలా చర్చలు జరిగాయి. ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని ఆహార పదార్థాలను వండడం వల్ల వండిన ఆహారంలోని పోషకాలు నాశనం అవుతాయి. అనారోగ్యకరమైనవిగా మారుతాయని అనేక సిద్ధాంతాలు చెబుతున్నాయి. పోషక విలువలు తగ్గుతాయా లేదా అనేది ఆహారం ఎలా వండుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుందని కూడా కొందరు అంటున్నారు.
చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రెషర్ కుక్కర్‌లో పిండి పదార్థాలను వండడం మీ ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే కుక్కర్‌లో పిండి పదార్థాలు వండడం వల్ల మీ ఆహారం నాశనం కావొచ్చు. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మీరు ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడని కొన్ని ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రెషర్ కుక్కర్‌లో సాధారణంగా వండే ఆహార పదార్థాల్లో బియ్యం ఒకటి. ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండడం వల్ల హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయని, ఇది అనేక వ్యాధులకు దారితీస్తుందని నమ్ముతారు. అలాగే ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది.
మనలో చాలా మంది బంగాళదుంపలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెడతారు. ఎందుకంటే ఇది చేయడానికి సులభమైన, వేగవంతమైన మార్గం. అయితే బంగాళదుంపలో స్టార్చ్ ఉంటుంది. కుక్కర్‌లో ఉడికించకూడదు. బంగాళాదుంపలను ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
పాస్తా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడదు. ప్రెషర్ కుక్కర్‌లో పాస్తా వండటం వల్ల మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది ఎల్లప్పుడూ ఒక కుండలో ఉడికించాలి లేదా ఆవిరి మీద ఉడికించాలి.
కుక్కర్‌లో వండకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అయినప్పటికీ అనేక ఆహార ఎంపికలకు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి. ప్రెషర్ కుక్కర్ ఫుడ్‌లోని లెక్టిన్ కంటెంట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. లెక్టిన్ ఒక హానికరమైన రసాయనం. ఇది ఖనిజాలను గ్రహించడం ద్వారా ఆహారం పోషక విలువను తగ్గిస్తుంది. ప్రాథమికంగా ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం లాభాలు, నష్టాలతో నిండి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్య సమస్యలను నివారించడానికి ప్రెషర్ కుక్కర్‌లో పిండి పదార్థాలను ఉడికించవద్దు.