Nindu Noorella Saavasam December 22nd Episode: చిత్రగుప్తుడిని మోసం చేసిన అరుంధతి.. ఒక్కటిగా 3 శక్తులు , ఘోరా ప్రయత్నాలు

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam 22nd December Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో అతిగా సపర్యలు చేస్తున్న భార్యని, బావమరిదిని చూసి ఆశ్చర్యపోతాడు రామ్మూర్తి. అసలు మీకు ఏం జరిగింది ఇవాళ అని అడుగుతాడు. నువ్వు మా కోసం కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను అంటుంది మంగళ. ఏమిటో మీ ప్రేమను కూడా భరించలేకపోతున్నాను అని స్కూల్ కి బయలుదేరుతాడు. కాళీని తోడు పంపిస్తాను అని మంగళ అంటే వద్దులే అని చెప్పి వెళ్లిపోతాడు రామ్మూర్తి.

 

ట్రెండింగ్ వార్తలు

బాగున్నరా అంకుల్

అంతా సిద్ధమే కదా తమ్ముడు నేను మనోహరిని కలవటానికి వెళ్తాను నువ్వు మీ బావ సంగతి చూసుకో అంటుంది మంగళ. అంతా సిద్ధమే అక్క, బావ స్కూలుకు వెళ్లే టైంకి బావ మీద ఎటాక్ జరగడం ఖాయం అంటాడు కాళీ. సరే అని చెప్పి ఇద్దరూ ఇంట్లోంచి బయలుదేరుతారు. కాళీ రామ్మూర్తిని వెంబడిస్తూ ఉంటాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక మహిళకి ఫోన్ చేసి నీ ఎదురుగా వస్తున్న వ్యక్తినే నువ్వు కలవాల్సింది అని చెప్పటంతో ఆమె రామ్మూర్తికి ఎదురుగా వచ్చి బాగున్నారా అంకుల్ అని పలకరిస్తుంది.

అయోమయంగా చూస్తున్న రామ్మూర్తితో నన్ను గుర్తుపట్టలేదా నేను భాగి ఫ్రెండ్‌ని అంటుంది. క్షమించమ్మా నిన్ను గుర్తుపట్టలేకపోయాను ఎలా ఉన్నావు అని అడుగుతాడు రామ్మూర్తి. బాగానే ఉన్నాను అంకుల్, భాగీకి పిల్లలు ఎంతమంది తను ఎలా ఉంది అని అడుగుతుంది ఆ అమ్మాయి. భాగీకి ఇంకా పెళ్లి అవ్వలేదు అని విచారంగా చెప్తాడు రామ్మూర్తి. అదేంటంకుల్ ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా, జీవితంలో ఒక తోడు అవసరం కదా. సరే భాగి పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండి అని తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ అమ్మాయి.

 

దొరికేసిన తాళం

ప్లాన్ సక్సెస్ అయిందని ఆనందపడతాడు కాళీ, అక్కకి చెప్పడానికి వెళ్తాడు. మరోవైపు చిత్రగుప్తుడు తాళం అక్కడ ఉన్నట్లు నాకు సిక్త్స్ సెన్స్ చెప్తుంది అని అంటాడు. రాథోడ్ నమ్మడు కానీ అమర్ తండ్రి చెప్పటంతో చిత్రగుప్తుడు చెప్పిన చోట తాళం వెతుకుతాడు. అక్కడ తాళం ఉంటుంది. ఆ విషయం పరుగు పరుగున వెళ్లి నీల మనోహరి కి చెప్తుంది. మనోహరి పరుగు పరుగున వచ్చి రాథోడ్ దగ్గర తాళం తీసుకొని తనే డోర్ కీ ఓపెన్ చేస్తుంది.

బయటికి వచ్చిన మిస్సమ్మని పలకరించి రాత్రి నిద్రపోయి ఉండవు వెళ్లి రెస్ట్ తీసుకో పిల్లల్ని ఈ పూట మేం చూసుకుంటాం అని చెప్తారు అమర్ తల్లిదండ్రులు. అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ ఈ తాళాలు ఎక్కడ దొరికాయి అని అడుగుతాడు. తోటమాలి చెప్పాడు అని చెప్తాడు రాథోడ్​. మీరు ఇంటి బయట ఉంటారు కదా మీకు ఈ తాళాల సంగతి ఎలా తెలుసు అని చిత్రగుప్తుడిని నిలదీస్తాడు అమర్​. ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు ఒకసారి చూశాను అంటాడు చిత్రగుప్తుడు.

నమ్మిస్తేనే కదా

మీరు చేయవలసింది తోట పని కదా మీరు ఎందుకు ఇంటి పని చేశారు అని మందలిస్తాడు అమర్​. ఏదో అవసరానికి సాయం చేసి ఉంటాడు మరి ఎప్పుడు చేయడులే అని చెప్పి చిత్రగుప్తుడిని బయటికి పంపించేస్తాడు అమర్​ తండ్రి. బయటికి వచ్చిన చిత్రగుప్తుడు అరుంధతిని అంగుళీకము అడుగుతాడు. నా దగ్గర లేదు అంటుంది అరుంధతి. నిన్ను నమ్మాను అంటాడు చిత్రగుప్తుడు. నమ్మిస్తేనే కదా మోసం చేయగలం అంటుంది అరుంధతి.

 

దయచేసి అంగుళీకము ఇవ్వు. నాతోపాటు మా లోకానికి వచ్చేయు లేదంటే నీకు ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. నిన్ను అంతం చేయడానికి మూడు శక్తులు ఏకమవుతున్నాయి అని హెచ్చరిస్తాడు చిత్రగుప్తుడు. నన్ను భయపెట్టడానికి కదా అలా అంటున్నారు అని ఆషామాషీగా తీసుకుంటుంది అరుంధతి. నీ పుట్టింటి వారు నీ అత్తింటి వారు నిన్ను ప్రమాదంలోకి నెట్టేయాలని చూస్తున్నారు. ఈ సంగతి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అని బాధపడతాడు చిత్రగుప్తుడు.

మా ఇంట్లోనే కదా

అరుంధతి మిస్సమ్మ దగ్గరికి వెళ్లి గది తాళాలు పోయాయి అంట కదా అని అడుగుతుంది. మా ఇంట్లో విషయాలు మీకు బాగా తెలుస్తాయి అక్క. అయినా మీ మీద చాలా కోపంగా ఉంది. మనం ఇంత క్లోజ్ గా ఉంటాం కదా మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తుంటారు కదా. అయినా ఎప్పుడూ మీ ఇంటికి నన్ను ఎందుకు పిలవలేదు అని అడుగుతుంది మిస్సమ్మ. ఇప్పుడు నువ్వు ఉన్నది మా ఇంట్లోనే కదా అని అరుంధతి అనడంతో మిస్సమ్మ షాక్ అవుతుంది.

మిస్సమ్మకు నిజం తెలిసిపోతుందా? ఘోరా అరుంధతిని పట్టుకోవడానికి ఏం చేయబోతున్నాడు? అనే విషయాలు తెలియాలంటే డిసెంబర్​ 23న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *