Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌లో కల్యాణ్, అప్పు మాట్లాడుకుంటుంటే అనామిక వస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు అడ్డుగా ఉంటున్నారని అప్పుని బయటకు పంపిస్తుంది. డోర్ దగ్గర నిలబడి ఎవరూ రాకుండూ చూడమని అప్పుకి చెబుతుంది అనామిక. అదేం మర్యాదా అలా అంటావ్ అని కల్యాణ్ అంటే.. మన బ్రోనే కదా అర్థం చేసుకుంటుంది అని అనామిక అంటుంది. దాంతో అప్పు బయట ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
కల్యాణ్‌కు హగ్
నా పేరెంట్స్‌కు కొడుకు అయినా, కూతురు అయినా నేనే. పెళ్లి తర్వాత కూడా నేను వాళ్లకు సహాయంగా నిలవాలని అనుకుంటున్నాను. కాబట్టి, వాళ్లకు ఏ సమస్య వచ్చినా నాకు సహాయం చేస్తానని మాట ఇవ్వు అని అనామిక అడుగుతుంది. కాస్తా ఆలోచించిన కల్యాణ్ సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తాడు కల్యాణ్. దీంతో థ్యాంక్స్ అంటూ కల్యాణ్‌ను హగ్ చేసుకుంటుంది అనామిక. ఇంతలో ధాన్యలక్ష్మీ, ప్రకాశం వస్తారు. అప్పు చెప్పిన వినకుండా డోర్ తీస్తారు.
కల్యాణ్, అనామిక హగ్ చేసుకోవడం చూసి షాక్ అవుతారు. పెళ్లికి ముందే కొంప ముంచకురా సుపుత్ర అని ప్రకాశం అనుకుంటాడు. నీతో నా బ్యాగ్ వచ్చింది. తీసుకెళ్దామని వచ్చానని. ఏవండి మోసుకురండి అని వెళ్లిపోతారు ఇద్దరు. మరోవైపు కావ్యకు అరుణ్ కాల్ చేసిన విషయం చెబుతుంది స్వప్న. ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపిస్తుందని స్వప్న అంటుంది. దాంతో ఎక్కడికీ వెళ్లకు. వాడు కాల్ చేస్తే నేను ఎక్కడికీ వెళ్లను. నువ్ ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పమని కావ్య అంటుంది.
కుచలకుమారికి పంచ్‌లు
స్వప్న ముందు భయపడిన చివరికి కావ్య చెప్పినదానికి ఒప్పుకుంటుంది. రిసార్ట్‌కు వచ్చిన అరుణ్ రాహుల్‌కు కాల్ చేసి లోపలికి రమ్మంటారా అని అడుగుతాడు. టైమ్ చూసుకుని స్వప్నకు ఎదురుపడు అంతే అని రాహుల్ చెబుతాడు. మరోవైపు తన అందం గురించి ధాన్యలక్ష్మీకి గొప్పలు చెప్పుకుంటుంది కుచలకుమారి. దానికి పంచ్‌లు, కౌంటర్లు వేస్తాడు ఆమె భర్త. తర్వాత నగలు గురించి మాట్లాడుకుంటారు. తర్వాత పంచె కట్టుకోకుండా చెడ్డీ మీద బయటకు వస్తాడు ప్రకాశం.
దాంతో అంతా నవ్వుతారు. మతిమరుపు తగిలెయ్య అని ధాన్యలక్ష్మీ తిట్టుకుంటుంది. హల్దీ ఫంక్షన్‌లో కావ్యపై ప్రేమ ఉన్నట్లు కావాలనే, తనను తిట్టించేందుకు నటిస్తాడు రాజ్. దాంతో అంతా సంతోషిస్తే.. అమ్మాయిలు చేయాల్సిన పనిని అబ్బాయి చేస్తుంటే చూస్తుంటావేంటీ, బుద్ధి లేదా అని అపర్ణ అంటుంది. ఇప్పుడు కాదు వదినా ఇంట్లోవాళ్లంతా నెత్తిన మీద పెట్టుకున్నప్పుడే దించాల్సింది అని రుద్రాణి అంటుంది.
పద్దు మెడకు హారం
తనే పని చేసుకుంటే నువ్వే వెళ్లి హెల్ప్ చేస్తానని పనులు చేశావ్. ఇప్పుడు కావ్యను అంటుంటే ఏం మాట్లాడవేంటీ అని రాధమ్మ రాజ్‌ను నిలదీస్తుంది. దాంతో అంతా రాజ్‌ను తప్పుబడుతుంటారు. సుభాష్ కూడా ఫైర్ అవుతాడు. తర్వాత పద్మావతి హారం పడిపోయేలా ఉందని హుక్ పెట్టమని విక్రమాదిత్యకు చెబుతారు ఇందిరాదేవి, కావ్య. దాంతో విక్రమాదిత్య హారం పెట్టినట్లే పెట్టి మెడకు బిగిస్తాడు. మరోవైపు రాజ్ పాదాన్ని కావ్య గట్టిగా తన్నడంతో గట్టిగా అరుస్తాడు.
తర్వాత కావ్య, రాజ్ జోడీపై పద్మావతికి, విక్కీ, పద్దు జోడీపై కావ్యకు తమలాగే ఇద్దరి జీవితం ఉందని అనుమానపడతారు. రాజ్ కావ్యలు ప్రేమ లేకున్నా కావాలనే నటిస్తున్నారని అనుమానంగా ఉందిరా అని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. తర్వాత హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. పసుపు గొప్పతనం గురించి ఇందిరాదేవి చెబుతుంది. తర్వాత ప్రకాశం మతిమరుపు గురించి అంతా జోకులు వేస్తారు. కల్యాణ్‌ను చూసి అప్పు బాధపడుతుంది. నువ్ కోరుకున్న అమ్మాయితోనైనా సంతోషంగా ఉండు అని అనుకుంటుంది.
ఆనందంతో కన్నీళ్లు
అప్పును చూసి పద్మావతి ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావని, ఆ కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయని అడుగుతుంది. అవి ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని కనకం చెబుతుంది. ఇంతలో అప్పుని కల్యాణ్ పిలుస్తాడు. అప్పుకు ఏమైందని పద్మావతి అనుమానపడుతుంది. తర్వాత కడుపుతో ఉన్న అరవింద మెట్లు ఎక్కుతుంటే కిందపడబోతుంది. దాంతో తన తమ్ముళ్లు వచ్చి పట్టుకుంటారు. దాంతో ఈ బంధం ఇలాగే ఉండాలని అంతా అనుకుంటారు.
అరుణ్‌ను రమ్మనమని, వాడిని చూసి స్వప్న షాక్ అవుతుందని, దాంతో తప్పులు చేస్తుంది. అప్పుడు నేను కథ నడిపిస్తానని రుద్రాణి అంటుంది. దాంతో అరుణ‌్‌కు కాల్ చేసి రమ్మంటాడు రాహుల్. తన కోడలికి కడుపు పండలేదని కుచలకుమారి అంటే.. అది మన చేతుల్లో ఉండదు. దైవ నిర్ణయం అని గట్టి కౌంటర్ ఇస్తుంది కావ్య. దాని గురించి కావ్యను నీకెందుకు అని రాజ్ అంటాడు. గెస్ట్‌గా వచ్చిన వాళ్లలో పర్సనల్స్ మాట్లాడొచ్చా. మీరు నన్ను ఇప్పటివరకు తాకలేదని నేను ఎవరికైనా చెప్పానా. మీ పరువు కాపాడుతున్నా కదా అని కావ్య అంటుంది.
అక్క కోసం
రాజ్, కావ్య సంతోషంగా లేరని ఇందిరాదేవితో రుద్రాణి అంటుంది. అది కావ్యకు స్వప్న చెబుతుంది. ఇప్పుడు మీ అత్తకు షాక్ ఇస్తానంటూ వెళ్లి రాజ్‌కు పసుపు పూస్తుంది కావ్య. ఇద్దరూ సంతోషంగా పసుపు పూసుకుంటారు. దాంతో వాళ్లు సంతోషంగా ఉన్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోకు అని రుద్రాణిని ఇందిరాదేవి అంటుంది. తర్వాత తన అక్క కోసం పద్మావతితో విక్రమాదిత్య పసుపు పూయించుకుంటాడు. ఇలా అంతా పసుపు పూసుకుంటూ సంతోషంగా ఉంటారు.
ఇంతలో అరుణ్ స్వప్నకు కనిపిస్తాడు. దాంతో స్వప్న పరిగెత్తుకుంటూ వెళ్లి కావ్యను తీసుకొస్తుంది. అప్పుడు అరుణ్ దాక్కుంటాడు. ఇద్దరూ చెరోవైపు వెతుకుతుంటారు. హమ్మయ్యా అనుకుంటూ అరుణ్ వెళ్లిపోతాడు. మరోవైపు అప్పును లాక్కొచ్చి కాబోయే అల్లుడితో అలా రాసుకుపూసుకు తిరగడానికి సిగ్గు లేదా అని నానామాటలు అంటారు. అది విన్న కనకం వచ్చి తనకు అలాంటి ఆలోచన లేదని అంటుంది. మాకు అలా అనిపించట్లేదని శైలజ అంటుంది.