Fenugreek For Hairs : జుట్టు రాలకుండా ఉండేందుకు మెంతి నీరు.. ఇలా తాగాలి

మెంతులు(Fenugreek) అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. హెయిర్ ఫాల్‌తో పోరాడటానికి, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడటానికి మెంతి నీరు తాగటం మంచి పద్ధతి. జుట్టు రాలడం సమస్యలకు చికిత్స చేయడానికి మెంతి నీటిని ఎలా తయారు చేయాలి? ఎలా వినియోగించాలి? అనే విషయాలు తెలుసుకుందాం..

ట్రెండింగ్ వార్తలు

మెంతులు గింజలు 2 tsp, 2 కప్పుల నీరు తీసుకోవాలి. మెంతులు తరచుగా అనేక వంటలలో వాడుతారు. దీని రుచి కాస్త చేదుగా ఉండటం వల్ల ఆహారంలోని తీపిని తగ్గించి, ఆహారానికి పోషకమైన రుచిని ఇస్తుంది. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతులు ఇన్సులిన్ చర్యను మెరుగుపరుస్తాయి. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

2 టీస్పూన్ల మెంతి గింజలను ఓ గిన్నెలో తీసుకోవాలి. అందులో 2 కప్పుల నీరు కలపండి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. ఈ నానబెట్టిన సమయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మెంతులలోని ప్రయోజనకరమైన సమ్మేళనాలను విడుదల చేయడంలో సహాయపడుతుంది.

విత్తనాలను రాత్రిపూట నానబెట్టిన తరువాత, నీటిని మరో గిన్నెలోకి తీసుకోండి. కావాలనుకుంటే విత్తనాలను ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల పోషకాలు సక్రమంగా శోషించబడతాయి. రుచిని మెరుగుపరచడానికి మీరు తేనె లేదా నిమ్మరసం జోడించవచ్చు.

మెంతి గింజలు ప్రోటీన్లు, విటమిన్లు (A, K, C), ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. జుట్టు రాలడాన్ని నివారించడానికి, ఆరోగ్యకరమైన జుట్టును(Healthy Hair) నిర్వహించడానికి ఈ పోషకాలు ముఖ్యమైనవి. మెంతులు డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) ను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇది జుట్టు రాలడానికి సంబంధించిన హార్మోన్.

మెంతికూరలోని ప్రొటీన్లు హెయిర్ సాఫ్ట్‌ను పటిష్టం చేయడానికి, జుట్టు చిట్లడం తగ్గించడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి దోహదం చేస్తాయి. మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. చుండ్రును నివారిస్తాయి. నెత్తిమీద తేమను అందించడంలో సహాయపడతాయి.

ఫలితాల కోసం మీ దినచర్యలో మెంతి నీటిని క్రమం తప్పకుండా జోడించండి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమయం పడుతుంది. సహనం చాలా అవసరం. మెంతి నీరు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, వివిధ రకాల పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం మొత్తం జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైనది. మీరు మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల కలయికను చేర్చుకోవాలి. మెంతి నీటితో పాటు రోజంతా హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే డీహైడ్రేషన్ జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.a

WhatsApp channel
 
Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *