Best Web Hosting Provider In India 2024

12th Fail Movie OTT Release: ఈ ఏడాది బాలీవుడ్‌లో మౌత్ టాక్‌తో హిట్టైన సినిమాల్లో 12th ఫెయిల్ ఒకటి. విక్రాంత్ మస్సే హీరోగా 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ బయోపిక్ మూవీ 70 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది.
ట్రెండింగ్ వార్తలు
12th ఫెయిల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకున్నది. జనవరి 5 న 12 ఫెయిల్ మూవీ జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. 12th ఫెయిల్ లో మనోజ్ కుమా ర్ పాత్రలో విక్రాంత్ మస్సే యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్నాయి.
ముంబైకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ 12వ తరగతిలో ఫెయిల్ అవుతాడు. పొట్టకూటి కోసం ఆటో డ్రైవర్‌గా మారిన అతడు ఎలా ఐపీఎస్‌గా సెలెక్ట్ అయ్యాడన్నది ఇన్‌స్పైరింగ్‌గా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ సినిమాలో చూపించారు.
విద్యావ్యవస్థలోని లోతుపాతులతో పాటు సివిల్స్ కోసం సన్నద్దమయ్యే పేద విద్యార్థుల జీవితాలను 12th ఫెయిల్ సినిమా లో మనసుల్ని కదలించేలా ఆవిష్కరించారు డైరెక్టర్. 12th ఫెయిల్ సినిమాలో మేద శంకర్, అనంత్ జోషి, అన్షుమాన్ పుష్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 27న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.