Made In Medak: మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో ఉభయచర యుద్ధ ట్యాంకర్ తయారీ

Made In Medak: భారత సైన్యం అమ్ములపొదిలోకి సరికొత్త యుద్ధ ట్యాంకర్ చేరనుంది. మెదక్‌ జిల్లా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఉభయచర మిలట్రీ ట్యాంకర్‌ను విజయవంతంగా పరీక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ఉన్న ఆర్డినెన్సు ఫ్యాక్టరీ అధికారులు మల్కాపురం చెరువులో యుద్ధ ట్యాంకులకు పరీక్షలు నిర్వహించారు. నీటిలో, నేలపై ప్రయాణించే బీఎంపీ యుద్ధ ట్యాంకులను తయారు చేశారు. ఏటా 130 ట్యాంకర్లను మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారు.

రష్యా అందించిన టెక్నాలజీ ని ఉపయోగించుకొని ఆర్డినెన్సు ఫ్యాక్టరీ లో తయారు చేసిన ట్యాంకర్‌ అన్ని పరీక్షల్ని విజయవంతంగా అధిగమించింది. ప్రతి సంవత్సరం వీటికి తప్పనిసరిగా నీటిలో నడిపే పరీక్షలు నిర్వహిస్తారని ఫ్యాక్టరీ జిఎం వివరించారు.

కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువులో గురువారం ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా, ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రత్న ప్రసాద్ మాట్లాడుతూ బీఎంపీ యుద్ధ ట్యాంకు నీటిలో గంటకు గరిష్టంగా 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, కనీసం మూడు కిలోమీటర్లు నీటిపై తేలియాడుతూ వెళ్లగలదని వివరించారు.

నేలపై, నీటిపై సమర్థవంతంగా ప్రయాణించే రెండు పరీక్షల్లో బీఎంపీ యుద్ధ ట్యాంకుకు విజయవంతంగా పరీక్ష నిర్వహించామని తెలిపారు. బీఎంపీ యుద్ధ వాహనం, ప్రధానంగా ఆర్మీ ని యుద్ధ స్థావరాలకు తీసుకెళ్తుందని, దానిపై 30ఎంఎం గన్ కూడా ఉంటుందని చెప్పారు. ఒకేసారి 13మంది వాహనంపై ప్రయాణించవచ్చన్నారు.

యుద్ధ ట్యాంకుల అవసరం పెరిగింది…..

గత కొద్దీ సంవత్సరాలుగా, భారత సైన్యానికి కావలిసిన యుద్ధ ట్యాంకుల అవసరం పెరుగుతున్నట్టు రత్న ప్రసాద్ తెలిపారు. ఇంతకు ముందు, ప్రతి సంవత్సరం సుమారుగా 120 ట్యాంకులు ఎద్దుమైలారం ఫ్యాక్టరీ లో తయారు చేసి పంపించే వారిమని, అయితే ఇప్పుడు భారత్ సైన్యానానికి 150 పైగా ట్యాంకులు అవసరం అవుతున్నాయన్నారు. సైన్యానికి కావాలసిన 150 పైగా ట్యాంకులను తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

మెదక్‌ ఫ్యాక్టరీ లో వీఐపీలు వాడే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎంవీపీఎస్ యుద్ధ వాహనాలు తయారు చేసే వారిమని అధికారులు తెలిపారు. ఇవి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో పూర్తిగా భారతీయ టెక్నాలజీతో తయారు చేసినవని తెలిపారు. ప్రస్తుతం పని భారం పెరగడంతో ఆ రెండు వాహనాలు తయారు చేసే బాధ్యతను ఆర్డినెన్సు ఫ్యాక్టరీ జబల్పూర్ కు అప్పగించినట్టు తెలిపారు.

ఇక్కడ తయారు చేసిన షిప్ మీద ఇండియన్ నేవీ ఉపయోగించే క్లోస్డ్ రేంజ్ నావళ్ గన్స్ ను కూడా జబల్పూర్ లో తయారు చేస్తున్నారని సార్జిత్ రెడ్డి వివరించారు. యుద్ధవాహనం పరీక్షల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ లు వేణు నాద్, అంబటి రాంబాబు, ఇతర అధికారులు ఉన్నారు. సమీప గ్రామంలోని, ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి యుద్ధ ట్యాంకుల పరీక్షను వీక్షించారు.

WhatsApp channel
 
Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *