Best Web Hosting Provider In India 2024

క్రిస్మస్ వస్తోంది. క్రైస్తవులకు క్రిస్మస్ చాలా ముఖ్యమైన పండుగ. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది జనాభా జరుపుకొనే పండుగలలో ఒకటి. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు తమ ఇళ్ల ముందు నక్షత్రాలను వేలాడదీయడం, క్రిస్మస్ చెట్లను ఉంచడం, వాటిని లైట్లతో అలంకరించడం చూస్తుంటాం.
ట్రెండింగ్ వార్తలు
ఈ క్రిస్మస్ చెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. క్రిస్మస్ చెట్టును ఇంట్లో ఉంచడం చాలా మంచిది, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని తెస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. అదే సమయంలో ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఉంచడం వల్ల ఇంటి వాస్తు దోషం తొలగిపోతుందని చెబుతారు. క్రిస్మస్ చెట్టు ఐక్యతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కలిసి అలంకరించుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సమస్యలు ఉండవని నమ్ముతారు.
క్రిస్మస్ చెట్టు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసి ఇంట్లో సంపదను పెంచుతుందని అంటారు. అది కూడా ఈ చెట్టును ఇంటికి ఈశాన్య దిశలో పెట్టాలి. ముఖ్యంగా క్రిస్మస్ చెట్టు త్రిభుజాకార ఆకారంలో ఉండాలి. వాస్తు ప్రకారం త్రిభుజాకారాన్ని అగ్ని ఆకారంగా పరిగణిస్తారు.
క్రిస్మస్ చెట్టును ఇంటి దక్షిణ భాగంలో ఉంచకూడదు. ఎందుకంటే క్రిస్మస్ చెట్టును ఇంటి దక్షిణ భాగంలో పెడితే ఇంటికి లాభం కాకుండా నష్టమే వస్తుంది. మీరు ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఉంచినట్లయితే చెట్టు చుట్టూ కొవ్వొత్తులను వెలిగించాలి. కొవ్వొత్తిని వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది కూడా రంగురంగుల, సువాసనగల కొవ్వొత్తులతో వెలిగిస్తే, ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉంటుంది.
క్రిస్మస్ చెట్టును లైట్లు, రిబ్బన్లతో అలంకరించాలి. ప్రతిచోటా గంటలు వేలాడదీయాలి. గంట నుండి వచ్చే ధ్వని సానుకూల శక్తిని తెస్తుంది. క్రిస్మస్ చెట్టుపై అలాంటి గంటను కట్టినప్పుడు, అది ఇంటి లోపల చేసే ధ్వని మొత్తం ఇంటికి సానుకూల శక్తిని తీసుకు వస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా క్రిస్మస్ చెట్టుపై ఎరుపు రంగు రిబ్బన్‌పై 2 నాణేలను వేలాడదీస్తే ఆ ఇంట్లో డబ్బుకు ఇబ్బంది ఉండదని కొందరు చెబుతారు.