Sravanthi 2: మళ్లీ వస్తున్న సెన్సేషన్ హిట్ సీరియల్.. చి.ల.సౌ స్రవంతికి సీక్వెల్‌.. స్రవంతి 2 ఎప్పుడు ప్రసారం అంటే?

Best Web Hosting Provider In India 2024

Sravanthi 2 Serial: కంటెంట్ ఉంటే సినిమా అయినా, సీరియల్ అయిన ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిసిందే. అలా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొన్ని సంవత్సరాల పాటు గెలుచుకుంది చి.ల.సౌ స్రవంతి సీరియల్. ప్రముఖ ఛానెల్ జెమినీ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ డైలీ సీరియల్‌‌కు సీక్వెల్ తీసుకురానున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

2006 నుంచి 2011 వరకు ప్రసారం అయిన చి.ల.సౌ స్రవంతి సీరియల్ ఒక సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. ఇందులోని పాత్రలు, కథ, కథనం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సీరియల్ మొత్తంగా 25 అవార్డులను అందుకుంది. అంతేకాదు ఈ సీరియల్ టైటిల్ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇందులో స్రవంతి పాత్రలో మీనా వాసు, శాడిస్ట్ భర్త మహేష్‌గా భరణి శంకర్ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే హీరోగా నందకిశోర్ అలరించాడు.

ఇప్పుడు ఈ సీరియల్‌కు సీక్వెల్‌ను తీసుకొస్తోంది జెమినీ ఛానెల్. స్రవంతి 2గా ఈ డైలీ సీరియల్‌ను ప్రసారం చేయనున్నారు. ఈ సీక్వెల్‌లో మీనా, భరణి శంకర్, నంద కిశోర్‌తోపాటు కొత్తగా మౌనిక, నిఖిల్ నటించనున్నారు. ఈ సీక్వెల్‌లో స్రవంతి పాత్రలో మౌనిక, రిషి క్యారెక్టర్‌లో నిఖిల్ నటిస్తున్నారు.

స్రవంతి 2 సీరియల్‌ను జెమినీ టీవీలో సోమవారం (డిసెంబర్ 25) నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇదివరకు ప్రోమోలు విడుదల చేశారు. అందులో స్రవంతిని రిషి కళ్లకు గంతలు కట్టి ఓ భవనంలోకి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్లిన స్రవంతి చాలా సంతోషంగా ఇదంతా నాకోసమే చేశారా అని అంటుంది.

తర్వాత బయటకు వచ్చేందుకు స్రవంతి ప్రయత్నిస్తుంటే డోర్ రాదు. డోర్ లాక్ చేసి నీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇకమీదట నేను బంధించాను. ఈ తాళాలు నా దగ్గరే ఉంటాయి అని చెప్పి రిషి వెళ్లిపోతాడు. మొదటి సీరియల్ తరహాలోనే శాడిస్ట్ భర్త చేతిలో నలిగిపోయే భార్య స్టోరీతో స్రవంతి 2 రానున్నట్లు తెలుస్తోంది.

 

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *