Best Web Hosting Provider In India 2024

వెల్లుల్లి చికెన్ ఫ్రై రెసిపీ
Garlic Chicken Fry: చికెన్‌తో ఏ రెసిపీలు వండినా చాలా టేస్టీగా ఉంటాయి. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచేలా వండుకోవడం చాలా అవసరం. ఇలా వెల్లుల్లితో కలిపి చికెన్ ఫ్రై చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. అలాగే శరీరానికి శక్తి కూడా అందుతుంది. సింపుల్‌గా వెల్లుల్లి చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
వెల్లుల్లి చికెన్ ఫ్రై కి రెసిపీ కి కావాల్సిన పదార్థాలు
ఎముకలు లేని చికెన్ ముక్కలు – అరకిలో
ఉల్లిపాయ – ఒకటి
వెల్లుల్లి రెబ్బలు – ముప్పై
కరివేపాకులు – గుప్పెడు
పచ్చిమిర్చి – ఎనిమిది
పసుపు – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
జీలకర్ర పొడి – ఒక స్పూను
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
వెనిగర్ – మూడు స్పూన్లు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
జీడిపప్పులు – గుప్పెడు
చికెన్ ఫ్రై రెసిపీ తయారీ ఇలా
1. చికెన్ ముక్కలను బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ కలిపి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి.
3. చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసి ఈ వెల్లుల్లి పేస్ట్ తో పాటు మసాలాలు, వెనిగర్, కార్న్ ఫ్లోర్ అన్నీ కలిపి మేరినేషన్ చేయాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ని వేయాలి.
5. ఆయిల్ వేడెక్కాక మేరినేషన్ చేసిన చికెన్ ముక్కలను అందులో వేసి ఫ్రై చేయాలి.
6. తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కళాయి పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి.
7. అందులో పచ్చిమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి తరుగు, కరివేపాకులు వేసి వేయించాలి.
8. అందులో చికెన్ ముక్కలను కూడా వేసి టాస్ చేయాలి.
9. అంతే వెల్లుల్లి చికెన్ వేపుడు రెడీ అయినట్టే. దీని రుచి చాలా టేస్టీగా ఉంటుంది.
టాపిక్