YSRCP Nandigama :





ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.24-9-2022(శనివారం) ..
ఎన్నికల హామీలలో 90 శాతం అమలు ..
ఐతవరం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని ఐతవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా తలచి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 90 శాతం మేర హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు , గత ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ము కాసిందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు , ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలకు ఆర్థిక భరోసా చేకూరేలా వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయుడు ఉదయలక్ష్మి, వైస్ ఎంపీపీ అన్నం పిచ్చయ్య , మండల అధ్యక్షులు నెలకుదిటి శివనాగేశ్వరరావు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : పోపూరి మృత్యుంజయ రావు గారి కుమారుడి వివాహ రిసెప్షన్..
Follow Us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka