Best Web Hosting Provider In India 2024
AP SI Results 2023: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్సై పోస్టులకు మొత్తం 315 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన వారి జాబితా వివరాలను పేర్కొంది రిక్రూట్ మెంట్ బోర్డు. వీరిలో 102 మంది మహిళలు ఉన్నారు. https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎంపికైన వారి వివరాలను చెక్ చేసుకోవచ్చని తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి 2022 నవంబర్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు 1,51,288మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు ఫిబ్రవరి 28న ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఇందులో 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్ష నిర్వహించారు. దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించిన 31,193 మంది అభ్యర్థులకు నాలుగు పేపర్లలో ఎస్సై తుది రాత పరీక్షను నిర్వహించారు. తాజాగా ఎస్సై తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.