Best Web Hosting Provider In India 2024

Heart attacks in Winter: క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి… ఇవన్నీ కూడా పెద్ద వేడుకగా జరిపే పండుగలు. ఇవన్నీ చలికాలంలోనే వస్తాయి. అంతేకాదు ఈ పండగలకు సెలవులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ సెలవుల్లోనే ఎక్కువ మంది గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. ఈ పండుగ సీజన్ ఎక్కువ మంది ప్రాణాలను తీస్తున్నట్టు తాజా అధ్యయనం చెబుతుంది. అది కూడా ఈ చలికాలంలో గుండె సమస్యలు అధికంగా పెరుగుతున్నాయి. కాబట్టి చలికాలంలో వచ్చే ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులలో జాగ్రత్తగా ఉండాలనే సూచిస్తున్నారు పరిశోధకులు.
ట్రెండింగ్ వార్తలు
చలికాలంలో గుండె పోటు
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. ఈ చల్లని ఉష్ణోగ్రతలు ధమనులను సంకోచించేలా చేస్తాయి. దీనివల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. అంతేకాదు ఆక్సిజన్ కూడా అవయవాలకు అందడం తగ్గుతుంది. దీని వలన నా గుండె మరింతగా కష్టపడి పని చేయాల్సి వస్తుంది. రక్తప్రసరణ తగ్గడం, గుండెకు ఆక్సిజన్ తగ్గడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో ఇతర సమయాలతో పోలిస్తే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. డిసెంబర్ 26 నుంచి జనవరి 1 మధ్యలో గుండె సంబంధిత మరణాలు అధికంగా సంభవిస్తున్నట్టు ఆరోగ్య సంస్థల పరిశోధనలో కూడా వెల్లడైంది. దాదాపు 28 ఏళ్ల పాటు ఈ అధ్యయనాన్ని నిర్వహించి మరీ చెప్పారు.
ఈ సెలవుల్లో అధికంగా ధూమపానాలు, మద్యపానాలు చేయడం, చల్లని వాతావరణంలో స్నేహితులతో ఎక్కువ కాలం గడపడం వంటివి కూడా గుండెపోటు బారిన పడడానికి కారణాలుగా తెలుస్తున్నాయి. అలాగే నిద్ర తక్కువ కావడం, రాత్రిపూట అధికంగా పార్టీలకు హాజరు కావడం వంటివి కూడా గుండెపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఇవన్నీ కలిసి గుండెపోటుకు కారణం అవుతున్నట్టు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటూనే గుండె విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. రాత్రి ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. అది కూడా వీలైనంతవరకు పది గంల్లోపే పడుకోవడానికి ప్రయత్నించండి. అధికంగా చలిగా ఉంటే శరీరానికి ఉష్ణోగ్రతను ఇచ్చే దుస్తులను వేసుకోండి. అతి చలి గుండెకు హానిచేస్తుంది. రాత్రిపూట అధికంగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాలను తినకూడదు. మరీ బిజీ షెడ్యూల్‌ను పెట్టుకోవడం కూడా మంచిది కాదు. మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఏ పనీ చేయకండి. అది డాన్స్ అయినా ఆటలు, పాటలు అయినా దూరంగా ఉండడం మంచిది.