
Best Web Hosting Provider In India 2024
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల ముంబైలో బిజీబిజీగా ఉంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండేను శుక్రవారం (డిసెంబర్ 22) వారు కలిశారు. ముంబైలోని సీఎం కార్యాలయానికి వెళ్లి షిండేను పలకరించారు రామ్‍చరణ్ దంపతులు. వారికి సాదర స్వాగతం పలికారు సీఎం కుటుంబ సభ్యులు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.
ట్రెండింగ్ వార్తలు
సీఎం కుమారుడితోనూ ముచ్చట
ఈ ఫొటోలను ఉపాసన కొణిదెల తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు. సీఎం షిండేకు పుష్పగుచ్ఛం ఇచ్చారు రామ్‍చరణ్, ఉపాసన. సీఎం కుమారుడు శ్రీకాంత్‍తో వారిద్దరూ ముచ్చటిస్తున్నట్టు మరో ఫొటోలు ఉంది. అభినందనలను, ఆలోచనలను ఈ సమావేశంలో పరస్పరం పంచుకున్నట్టు రామ్‍చరణ్ టీమ్ వెల్లడించింది.
సీఎం షిండే కోడలు వృశాలీ.. హారతితో రామ్‍చరణ్, ఉపాసనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉపాసనకు బొట్టు పెట్టారు. బ్లూ డెనిమ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‍ను రామ్‍చరణ్ ధరించగా.. ఉపాసన ఫ్లోరల్ కుర్తీ ధరించారు. అయితే, వారి వెంట కూతురు క్లీంకారను తీసుకురాలేదు.
ముంబైలో వారంగా..
రామ్‍చరణ్, ఉపాసన దంపతులు వారం రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి ముంబైకు బయలుదేరారు. తమ కూతురు క్లీంకారకు ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ముంబైలోని మహాలక్ష్మి దేవాలయానికి వారు వెళ్లారు. కూతురితో సహా అమ్మవారిని దర్శించుకున్నారు.
సినిమాల విషయానికి వస్తే..
ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు రామ్‍చరణ్. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ఆర్ఆర్ఆర్ బ్లాక్‍బాస్టర్ హిట్ తర్వాత తదుపరి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు రామ్‍చరణ్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.