Best Web Hosting Provider In India 2024

Usiri Rice recipe: చలికాలంలో ఖచ్చితంగా తినాల్సిన పదార్థాల్లో ఉసిరికాయ ఒకటి. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలు, పెద్దలు కచ్చితంగా తినాల్సిన పదార్థం ఇది. కానీ దీని రుచి నచ్చక చాలామంది తినరు. శీతాకాలంలో ఉసిరికాయలను తినాలంటే ఇలా ఉసిరి రైస్‌ను చేసుకోండి. దీని టేస్ట్ అందరికీ నచ్చుతుంది. అలాగే ఉసిరికాయను తిన్నట్టుగానూ ఉంటుంది. ఉసిరిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఉసిరి రైస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
ఉసిరి రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యము – ఒక కప్పు
ఉసిరికాయలు – ఐదు
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – రెండు కప్పులు
నువ్వులు – రెండు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
శనగపప్పు – ఒక స్పూను
ఆవాలు – ఒక స్పూను
నూనె – మూడు స్పూన్లు
నువ్వులు – రెండు స్పూన్లు
అల్లం తురుము – అర స్పూను
ఎండుమిర్చి – రెండు
పచ్చిమిర్చి – రెండు
వేరుశెనగ పలుకులు – మూడు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
ఉసిరి అన్నం రెసిపీ
1. బియ్యాన్ని బాగా కడిగి కుక్కర్లో అవి ఉడకడానికి సరిపడా నీళ్లు వేసి, కాస్త పసుపు వేసి విజిల్ పెట్టి ఉడికించాలి.
2. అన్నాన్ని ముద్ద కాకుండా చూసుకోవాలి. పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు, మిరియాలు వేసి వేయించుకోవాలి.
4. ఆ రెండింటినీ పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేయాలి.
5. ఆ నూనెలో మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ పలుకులు, ఆవాలు వేసి వేయించాలి.
6. ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేయాలి. కరివేపాకులను కూడా వేసి వేయించాలి.
7. ఉసిరికాయ తురుమును రెడీ చేసుకుని, ఆ తురుమును కూడా అందులో వేసి వేయించుకోవాలి.
8. చిన్న మంట మీద ఇదంతా చేయాలి. లేకపోతే త్వరగా మాడిపోతాయి.
9. కాస్త పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముందుగా వండుకున్న అన్నాన్ని అందులో వేసి కలపాలి.
10. మిక్సీలో చేసి పెట్టుకున్న నువ్వులు, మిరియాల పొడిని కూడా వేసి కలుపుకోవాలి.
11. పైన కాస్త కొత్తిమీరను చల్లుకుంటే ఉసిరికాయ అన్నం రెడీ అయినట్లే.
12. ఇది లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ. టేస్ట్ కూడా అదిరిపోతుంది.
దీంతో ఎలాంటి కూరలు అవసరం లేదు… కాబట్టి ఈ ఉసిరి అన్నం తింటే చాలు. ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.
టాపిక్