YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.27-9-2022(సోమవారం) ..
మహిళాభివృద్ధే .. సమాజాభివృద్ధి …
అక్క, చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకే వైయస్సార్ చేయూత ..
వైయస్సార్ చేయూత వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నగర పంచాయతీ పరిధిలో 1634 మంది అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ చేయూత 3 వ విడత ద్వారా 3 కోట్ల 6 లక్షల 37 వేల 500 వందలు బ్యాంకు ఖాతాల్లో జమ ..
నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నగర పంచాయతీ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్సార్ చేయూత వారోత్సవాల కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొన్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వైయస్సార్ చేయూత పథకం ఎస్సీ- ఎస్టీ -బీసీ -మైనారిటీ పేద అక్కచెల్లెమ్మల భవితను మార్చనుందని , మహిళా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు , ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18, 750 ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందుతుందన్నారు , ప్రభుత్వం అందిస్తున్న సాయానికి తోడు ఆయా పథకాలు ,బ్యాంకుల నుంచి రుణాలు అందించి మహిళలను ఔత్సాహిక వ్యాపారులుగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు , ప్రభుత్వం అందిస్తున్న సాయం వల్ల మహిళల ఆర్థిక సాధికారత పెరుగుతుందని దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సైతం మెరుగుపడుతుందని చెప్పారు ,
దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు ..
ఆయా రంగాల్లోని వారికి బలమైన తోడ్పడుతో పాటు మహిళలకు అవసరమైన సాంకేతిక మార్కెటింగ్ సహకారం అందించేందుకు దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలతో పాటు ఆయా బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు తెలిపారు , దీని ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయంతో పాటు గ్రామీణ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పొందుకొని ఉపాధి అవకాశాలు సైతం లభిస్తాయని తెలిపారు , ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని ,ఇప్పటికే 90 శాతం మేర హామీలు అమలు చేశారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ , వైస్ చైర్మన్ , కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు ,ఏఈ ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , డ్వాక్రా మహిళలు ,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama :ఉచిత మెగా మెడికల్ క్యాంపు….
Follow Us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka