YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు (కొడవటికల్లు) :
ది.27-9-2022(సోమవారం) ..
కొడవటికల్లు గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో అంగన్ వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కొడవటికల్లు గ్రామంలో రూ. కోటి 20 లక్షల వ్యయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
గ్రామంలో హై స్కూల్ నిర్మాణానికి సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చిన దాత కందుల సాంబయ్య గారిని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు మండలంలోని కొడవటికల్లు గ్రామంలో రూ. కోటి 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి , 16 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడి భవన నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం శంకుస్థాపన చేశారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని , గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సచివాలయ భవనాలు , రైతు భరోసా కేంద్రాలు , అంగన్వాడి భవనాలు , నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల రూపంలో మార్చే విధంగా చర్యలు ,విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు , ఇంటింటికి తాగునీటి కులాయి ఇలాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు , కొడవటికల్లు గ్రామంలో 9 గదులతో నిర్మించనున్న పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గ్రామస్తుడు కందుల సాంబయ్య గారు విరాళంగా ఇవ్వటం అభినందనీయమన్నారు , అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు , స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి చేతుల మీదుగా అందజేశారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,జడ్పిటిసి , ఎంపీపీ , ఎంపీటీసీ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , స్థానిక అధికారులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : అక్క, చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకే వైయస్సార్ చేయూత ..
Follow Us :Facebook ,Twitter ,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka