Best Web Hosting Provider In India 2024

Beauty Tips: ఒకప్పుడు పూర్వీకులు గంజిని ప్రతిరోజు తాగేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండే వారని చెప్పుకుంటారు. ఆయుర్వేదంలో కూడా గంజికి ఉన్నత స్థానమే ఉంది. కానీ ఇప్పుడు గంజి తాగే వారి సంఖ్య చాలా తక్కువ. గ్రామాల్లో దీన్ని తాగడం తగ్గించేశారు. అన్నం వండుకునే పద్ధతులు మారిపోవడంతో గంజి దొరకడం లేదు. ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ కుక్కర్లో, వంటలు రావడంతో గంజి ఉత్పత్తి కావడం లేదు గంజి వచ్చేలా అన్నాన్ని ప్రత్యేకంగా వండుకోవాలి. ఈ గంజిలో ప్రోటీన్లు క్యాల్షియం, డైటరీ ఫైబర్, జింక్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు గ్లాసు గంజిని తాగితే చాలు… ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఆరోగ్యమే కాదు, చక్కటి అందం కూడా సొంతమవుతుంది మెరిసిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు
గుండెకు గంజి
రోజూ వ్యాయామాలు చేయడానికి ఇష్టపడేవారు ప్రోటీన్ షేక్ కన్నా గ్లాసుడు గంజిని తాగడం మంచిది. ఇది శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. కండలు పెరిగేలా చేస్తుంది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభించేలా చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజూ గంజిని తాగడం మంచిది. దీనిలో ఉండే ఫైబర్లు, ఫైటో కెమికల్స్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెకు కూడా మంచిదే. గుండె సమస్యలు, గుండెపోటు వంటివి రాకుండా ఉంటాయి.
విరేచనాలతో ఇబ్బంది పడుతున్న వారు, వాంతులు వల్ల అనారోగ్యం పాలవుతున్న వారు ప్రతిరోజూ గంజిని తాగితే మంచిది. ఇది విరేచనాల వల్ల కలిగే నీరసాన్ని తగ్గిస్తుంది. శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి అందిస్తుంది.
గంజి తాగడం వల్ల శారీరాక ప్రశాంతతే కాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇందులో ఉండే ఖనిజ లవణాలు కడుపులో మంట, నొప్పి రాకుండా అడ్డుకుంటాయి. జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలనుకునేవారు ప్రతిరోజూ గంజిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని ఆయుర్వేదం నిర్ధారిస్తోంది. బియ్యంతో తయారైన గంజిలో ఇనోసెటాల్ అధికంగా ఉంటుంది. గంజిని తాగినప్పుడు ఇది కూడా మన శరీరంలో చేరుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాదు, జుట్టు రాలడాన్ని ఆపుతుంది. జుట్టు చర్మం మెరుపు సంతరించుకోవాలంటే ప్రతిరోజూ గంజిని తాగండి.
గంజి ఇలా వండండి…
గంజి వచ్చేలా అన్నం వండాలంటే ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీళ్లను పోయాలి. అన్నం ఉడికిపోయాక గంజి నీళ్లు పైకి తేలుతూ ఉంటాయి. ఆ గంజి నీళ్లను వార్చి వేరు చేసుకోవాలి. అన్నాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ గంజి చల్లారాక అందులో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు గంజి చల్లారాక అందులో అన్నం తీసుకొని… సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్,చి రుచికి సరిపడా ఉప్పును కలుపుకొని తింటే టేస్టీగా ఉండటమే కాదు శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. రాత్రిపూట ఇలా తయారు చేసుకుని ఉదయం పులిశాక ఆ అన్నాన్ని తింటే ఎలాంటి రోగాలు అయినా తగ్గుతాయి. శరీరానికి సత్తువ వస్తుంది.