Best Web Hosting Provider In India 2024

ప్రజల జీవన విధానం మారి ఒత్తిడితో బతుకుతున్నారు. ఈ రకమైన జీవన విధానం అనేక రకాల శారీరక, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడటం కామన్ అయిపోయింది. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా నిద్రలో మెలకువ రావడం, మళ్లీ నిద్రపట్టకపోవడం అనే సమస్య కొందరికి పెరుగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ఇలా నిద్ర లేవగానే కొందరు నీళ్లు, కాఫీ, టీలు తాగుతూ మొబైల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. మరికొందరు లేచి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. రాత్రి పడుకున్నాక కళ్లు మూసుకున్నా నిద్ర రావడానికి చాలా సమయం పడుతుందనేది చాలా మంది సమస్య. మీరు సరిగ్గా నిద్రపోకపోతే అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీ జీవన నాణ్యత దెబ్బతింటుంది. అందుకే అర్ధరాత్రి నిద్ర లేవగానే ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.
మీకు మంచి నిద్ర కావాలంటే రాత్రి పడుకునే ముందు మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినకుండా సాధారణ ఆహారాన్ని రెగ్యులర్ గా తినడం మంచిది. పడుకునే కొన్ని నిమిషాల ముందు ఒక గ్లాసు పాలు, నీళ్లు తాగడం మంచిది.
రాత్రిపూట బ్లూ లైట్ గాడ్జెట్‌లను ఉపయోగించడం మంచిది కాదు. ఇది కిరణాలు కళ్లపై పడటం వల్ల నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
రాత్రిపూట అకస్మాత్తుగా నిద్రలేచినట్లయితే మంచం మీద నుంచి కిందకు రాకపోవడమే మంచిది. మంచం మీద కాసేపు ఉండడం వల్ల మళ్లీ నిద్ర పట్టవచ్చు. మీరు ఎక్కువసేపు నిద్రపోలేకపోతే, మంచం మీద నుండి లేచి కొంతసేపు నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి. లేదంటే మళ్లీ నిద్రపోయే వరకు పుస్తకం తెరిచి చదవాలి. ఇది పని చేయకపోతే గోరువెచ్చని నీరు త్రాగాలి. కళ్ళు మూసుకుని కాసేపు కుర్చీలో కూర్చోండి. నిద్ర తిరిగి వస్తుందని అంచనా వేసిన వెంటనే మంచం మీదకు వెళ్లాలి.
అర్ధరాత్రి నిద్ర లేచిన వెంటనే కళ్లు తెరిచి పైకి చూస్తూ ఉండకూడదు. మొబైల్ ఫోన్లు వాడకూడదు. ముఖ్యంగా కొంత మంది మొబైల్ ఫోన్లు తీసి టైం చూసుకుంటారు. ఇలా మొబైల్‌లో సమయం చూసుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. అలాగే మీ దృష్టి మొబైల్ వినియోగం వైపు వెళ్తుంది. తిరిగి నిద్రపోవడం ఆలస్యం కావచ్చు.
కొందరైతే నిద్ర లేచి ఆ ప్రదేశాన్ని వదిలి వేరే చోటికి వెళ్లి నిద్రించడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల కొందరికి నిద్ర పట్టదు. పొజిషన్ మార్చకుండా మళ్లీ అదే పొజిషన్ లో పడుకునే ప్రయత్నం చేయడం మంచిది. వేరే చోటికి వెళ్లి నిద్రించడానికి ప్రయత్నించినప్పుడు నిద్ర సరిగా రాదు. మీరు మంచి నిద్ర పొందడానికి వివిధ పద్ధతులను ప్రయత్నించవచ్చు. కానీ నిద్ర సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించాలి.