Best Web Hosting Provider In India 2024

వంట చేసే సమయంలో గ్యాస్ సిలిండర్ అయిపోవడం చాలా ఇరిటేషన్ ఫిలింగ్ కలిగిస్తుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయటపడటానికి మరో సిలిండర్‌ను మెయింటెన్ చేస్తారు. అయితే ప్రతి ఇంటికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఎప్పుడూ గ్యాస్ ఎంత ఉందో చెక్ చేస్తూ ఉండాలి. అందు కోసం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు.
ట్రెండింగ్ వార్తలు
గ్యాస్ సిలిండర్ అధిక పీడనాన్ని తట్టుకోవడానికి, గ్యాస్‌ను నిల్వ చేయడానికి, నియంత్రించడానికి అధిక కార్బన్ స్టీల్, మాంగనీస్ స్టీల్ లేదా అల్యూమినియం మిశ్రమంతో తయారు చేస్తారు. అందుకే గ్యాస్ బండ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ కారణంగా గ్యాస్ స్థాయిలను తెలుసుకోవడం సాధ్యం కాదు.
కొందరు వ్యక్తులు గ్యాస్ స్థాయి తెలుసుకునేందుకు దాన్ని చేతితో కాస్త పైకి ఎత్తి అంచనా వేస్తారు. మరికొందరికి ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. గ్యాస్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు నీలం నుండి ఎరుపు రంగులోకి మంట మారుతుంది. దీనిని చూసి గ్యాస్ అయిపోవస్తుందని డిసైడ్ అవుతారు. కానీ ఇంకొన్ని రోజులు వస్తుందిలే గ్యాస్ అనుకున్న సమయంలో అయిపోతే మాత్రం కష్టమే. అందుకే గ్యాస్ సిలిండర్ పరిమాణాన్ని ఎల్లప్పుడూ తెలుసుకోవడం ముఖ్యం. మీకు సహాయపడే ఒక ట్రిక్ గురించి తెలుసుకుందాం.. గ్యాస్ అయిపోయేముందు తెలుసుకుని బుక్ చేసుకోవచ్చు.
మీరు వంట చేసే సమయంలో గ్యాస్ సిలిండర్ సగం అయిపోతే విసుగు చెందుతారు. ముఖ్యంగా రాత్రిపూట ఈ పరిస్థితి ఎదురైతే ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వస్తుంది. అయితే తడి బట్ట ట్రిక్ మీ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.
తడి టవల్/బట్టను తీసుకుని సిలిండర్ చుట్టూ చుట్టండి. కొంత సమయం తర్వాత సిలిండర్ ఉపరితలం పరిశీలించండి. తడి బట్ట తొలగించండి. కొన్ని సెకన్ల తర్వాత, సిలిండర్‌లోని కొన్ని భాగాలు చాలా త్వరగా ఆరిపోవడాన్ని, కొన్ని భాగాలు తడిగా ఉన్నాయని మీరు గమనించవచ్చు. అంటే గ్యాస్ లేని ప్రాంతంలో కొద్దిగా పొడిగా ఉంటుంది. గ్యాస్ ఉన్న ప్రాంతంలో తడిగా ఉంటుంది. తడి భాగం కూడా ఎండిపోవడం జరుగుతుంటే.. మీరు గ్యాస్ అయిపోయినట్లుగా అనుకోవాలి. మీరు ఈ ఉపాయాన్ని ఉపయోగించి ప్రతి 2-3 రోజులకు మీ గ్యాస్ స్థాయిని చూసుకోవచ్చు.
మరో సింపుల్ చిట్కా ఏంటంటే.. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తీసుకోండి. గ్యాస్ అంచున పోయండి. గ్యాస్ వచ్చే గొట్టం దగ్గర అస్సలు పోయకండి. నీరు పోసిన తర్వాత చేతితో తడిమి చూస్తే మీకు వేడిగా కొంత భాగం అనిపిస్తుంది. కొంత కిందకు వస్తే చల్లగా అనిపిస్తుంది. చల్లగా అనిపించే ప్రదేశం నుంచి కింద వరకూ మీ గ్యాస్ ఉన్నట్టు. ఈ చిట్కా కోసం గోరు వెచ్చని నీరు మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి.