Best Web Hosting Provider In India 2024

Pallavi Prashanth Released From Jail: బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. డిసెంబర్ 17న అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ప్రభుత్వ ఆస్తుల దాడి ఘటనలో పల్లవి ప్రశాంత్‌ను ఏ1 నిందితుడిగా, అతని సోదరుడు మహావీర్‌ను ఏ2 నిందితుడిగా కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు
ఈ కేసులో పల్లవి ప్రశాంత్, మహావీర్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్ గూడా జైలుకు తరలించారు. అనంతరం బెయిల్ పిటిషన్ పెట్టుకున్న పల్లవి ప్రశాంత్‌కు చుక్కెదురు అయింది. బెయిల్ విషయంలో తీర్పును వాయిదా వేసిన నాంపల్లి కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో డిసెంబర్ 23న చంచల్ గూడా జైలు నుంచి బయటకొచ్చాడు.
అయితే, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఆదివారం (డిసెంబర్ 24) జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరుకావాలని పల్లవి ప్రశాంత్‌ను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే జైలు నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ తన పేరు మార్చుకున్నాడు. అది సోషల్ మీడియా అయినా ఇన్‌స్టా గ్రామ్‌లో తన పేరు, బయోను మార్చేశాడు.
పల్లవి ప్రశాంత్ తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో MALLA OCHINA, SPY Team Winner అంటూ కొత్తగా పేరు మార్చాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా నిలవడంలో SPY (శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్) బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించి అలా మార్చుకున్నట్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక బిగ్ బాస్ వల్ల ప్రశాంత్‌కు ఇన్‌స్టాలో 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
టాపిక్