Best Web Hosting Provider In India 2024

మనిషి ఈ భూమిపై ఎంతకాలం ఉంటాడో ఎవరికీ తెలియదు. జననం, మరణం మన విధిలో భాగం. ఈరోజు జీవించిన వ్యక్తి రేపు బతికే ఉంటాడన్న గ్యారెంటీ లేదు. కానీ మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు డిసైడ్ అవుతాయని చాణక్యుడు పేర్కొన్నాడు. దాన్ని ఎవరూ మార్చలేరని తెలిపాడు. మనం ఏది సాధించాలనుకున్నా.. ఆ విషయం ముందుగానే నిర్ణయించి ఉంటుందని చెప్పాడు. చాణక్యుడు ప్రకారం మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు నిర్ణయించే ఆ నాలుగు విషయాల గురించి తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే.. కడుపు నుండి బయటకు వచ్చిన తర్వాత బిడ్డ సంతోషంగా ఉంటుందా లేదా విచారంగా ఉంటుందా అనేది నిర్ణయించబడుతుంది. భూమిపైకి వచ్చిన తర్వాత దీనిని అనుభవించాలని అతని నుదుటిపై రాసి ఉంటుంది. పూర్వ జన్మల కర్మలను ఈ జన్మలో అనుభవించాలి.
చాణక్యుడి ప్రకారం మరణాన్ని ఎవరూ మార్చలేరు. మనం తల్లి కడుపులో ఉండే సమయంలో చావు గురించి కూడా నిర్ణయించడుతుందట. మీరు ఎంత కోటీశ్వరులు లేదా ఎంత ప్రభావవంతమైన వ్యక్యులు అయినా సరే.. మీ మరణాన్ని ఎవరూ తప్పించలేరు.
చాలా మందికి విద్యారంగంలో సాధించాలనే తపన ఉంటుంది. ఇంకా కొందరికి బాగా డబ్బు సంపాదించి లక్షాధికారులు కావాలనే కోరిక ఉంటుంది. కొందరు చేయగలరు, కొందరు చేయలేరు. మీరు జీవితంలో ఏమి అవుతారు? ఏం సాధిస్తారు అనేది, మీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో గర్భంలో నిర్ణయం జరుగుతుంది. అందుకే భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకోవాలి.. ఎక్కువగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకూడదు.
మనిషి భవిష్యత్తు గురించి ఎక్కువగా కలలు కంటాడు. మనిషి ఆశ జీవి. రేపు నా జీవితంలో ఇది జరగాలి, మరో పదేళ్లలో నేను లక్షాధికారిని అవుతాను… అలా మనుషులు కలలు కంటారు. చాణక్యుడు ప్రకారం భవిష్యత్తు గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత కాలం జీవించాలి అని నీ తల్లి గర్భంలో నిర్ణయం అయ్యాక దానిని ఎవరూ మార్చలేరు.