Best Web Hosting Provider In India 2024

Mulled Wine : క్రిస్మస్ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. పార్టీలు చేసుకుంటారు. ఆల్ రెడీ క్రిస్మస్ వేడుకలకు రెడీ అయిపోయారు. క్రైస్తవులే కాకుండా ఇతర మతాల వారు ఈ పండగలో పాల్గొంటారు. ఇప్పటికే డెకరేషన్స్ ఎలా చేయాలో అని ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఈ రోజు క్రిస్మస్ స్పెషల్ గా మల్లేడ్ వైన్ తీసుకుంటే సూపర్ ఉంటుంది. కేక్ కటింగ్ ఉన్నట్టుగానే వైన్ కూడా క్రిస్మస్ లో ఆకర్శణగా నిలుస్తుంది. క్రిస్మస్ పార్టీ కోసం దీన్ని ఎలా చేయాలో చూద్దాం..
ట్రెండింగ్ వార్తలు
వైన్ తయారీకి కావలసినవి
750 ml రెడ్ వైన్
1/4 కప్పు బ్రాందీ
1 నారింజ
8 లవంగాలు
2 టేబుల్ స్పూన్లు చక్కెర, తేనె..
మల్లేడ్ వైన్ ఎలా తయారు చేయాలంటే
నారింజ లేదా నిమ్మకాయను వృత్తాలుగా కట్ చేసి గాజులో ఉంచండి.
మల్లేడ్ వైన్ తయారు చేయడం చాలా సులభం, అన్ని పదార్థాలను కలపండి. వాటిని పాన్‌లో పెట్టాలి.
తక్కువ వేడి మీద వైన్ వేడి చేయాలి. అది అంత ఈజీగా మరగదు. పాత్రపై మూత పెట్టి 15 నిమిషాలు మరిగించాలి.
మంట మీద నుంచి దించి 3 గంటలపాటు చల్లారనివ్వాలి. అవసరమైతే కొద్దిగా పంచదార వేసి సర్వ్ చేయాలి.
క్రిస్మస్ కోసం ఈ మల్లేడ్ వైన్ ప్రత్యేకంగా ఉంటుంది. క్రిస్మస్ అంటే కేక్‌తోపాటుగా ఈ వైన్ ఉంటే ప్రత్యేకంగా ఉంటుంది. క్రిస్మస్ కేక్ ఎంత ముఖ్యమో వైన్ కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఈ మల్లేడ్ వైన్ చాలా ప్రత్యేకమైనది. క్రిస్మస్ డిసెంబర్ నెలలో వస్తుంది, ముఖ్యంగా చలికాలం కాబట్టి ఈ మల్లేడ్ వైన్ వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ వైన్ సాధారణ రెడ్ వైన్ కంటే రుచిగా ఉంటుంది.