Best Web Hosting Provider In India 2024

Roshan Kanakala: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల బబుల్‌గమ్ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. బబుల్‌గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. స్కిన్ కలర్ విషయంలో తనపై వస్తోన్న ట్రోల్స్‌పై రోషన్ కనకాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రియాక్ట్ అయ్యాడు.
ట్రెండింగ్ వార్తలు
“మస్తు కర్రెగా (నల్లగా) ఉన్నాడు. వీడు హీరో ఏంటి” అని తన గురించి చాలా మాట్లాడుకోవడం విన్నానని, చదివానని రోషన్ కనకాల అన్నాడు. “వీడు హీరో మెటీరియల్, వీడి ముఖం బాగా లేదని” తనపై దారుణంగా నెగెటివ్ కామెంట్స్ చేశారని రోషన్ కనకాల చెప్పాడు. “నేను ఇలాగే పుట్టా..ఇలాగే ఉంటా. ఒక మనిషికి నలుపు తెలుపు…అందం కాదు. ఒక మనిషి సక్సెస్‌ను డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లెన్ మాత్రమేనని” రోషన్ కనకాల అన్నాడు.
ఓ రోజు వస్తాది. వద్దనుకున్నా వినబడతా. చెవులు మూసుకున్నా వినబడతా. డిసెంబర్ 29న థియేటర్లకు రండి. బబుల్‌గమ్‌లో ఈ ఆదిగాడి లవ్‌ను చూడండి. గౌరవం కోసం ఆదిగాడు చేసే పోరాటం చూడండి అని రోషన్ కనకాల కామెంట్స్ చేశాడు.
తనపై వస్తోన్న ట్రోల్స్‌పై రోషన్ కనకాల చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తనయుడి స్పీచ్‌కు సుమ కనకాల కూడా ఫిదా అయ్యింది. బబుల్‌గమ్ సినిమాకు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు. మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది.
టాపిక్