Best Web Hosting Provider In India 2024

Salaar Day 4 Estimated Collection: ప్రభాస్, శ్రుతి హాసన్ హీరోహీరోయిన్లుగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బాబీ సింహా ముఖ్యపాత్రలు పోషించిన సినిమా సలార్ సీజ్ ఫైర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ డిసెంబర్ 22న విడుదలై మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
సలార్ 2 డేస్ కలెక్షన్స్
సలార్ మూవీకి మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 97.49 కోట్ల షేర్, రూ. 167 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజున రూ. 45. 78 కోట్ల షేర్, రూ. 84.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇలా సలార్ మూవీకి మొదటి రెండు రోజుల్లో సుమారు రూ. 150 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సలార్ చిత్రానికి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 295.7 కోట్ల గ్రాస్ వసూలు అయనట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో
సలార్ మూవీకి మూడో రోజున అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే అయ్యాయి. దీంతో సలార్‌కు తెలుగు రాష్ట్రాల్లో రూ. 36-38 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటక, తమిళ్, కేరళ అన్ని కలిపి రూ. 15 కోట్ల రేంజ్‌లో వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఇక హిందీతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 24 నుంచి 25 కోట్ల వరకు గ్రాస్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో 2-2.5 మిలియన్ డాలర్స్ (రూ. 20 కోట్లు) అందుకున్నట్లు తెలుస్తోంది.
3వ రోజు మాస్ ర్యాంపేజ్
ఇలా సలార్ మూవీ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 140 కోట్ల గ్రాస్ అందుకోగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా కలెక్షన్లతో మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తోన్న సలార్ 4వ రోజు మాత్రం కాస్తా డీలా పడినట్లుగా తెలుస్తోంది. నాలుగో రోజు మొత్తంగా సలార్‌కు రూ. 13.64 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే వచ్చినట్లు సమాచారం. అందుకు వర్కింగ్ డే అయిన సోమవారమే కారణం అని తెలుస్తోంది.
తగ్గిన అడ్వాన్స్ బుకింగ్స్
సలార్ మూవీకి 4వ రోజు ఇప్పటివరకు తెలుగులో రూ. 9.068 కోట్లు, మలయాళ వెర్షన్‌లో రూ. 22.85 లక్షల టికెట్స్ అడ్వాన్స్‌డ్‌గా బుక్ అయినట్లు సమాచారం. అలాగే హిందీ బెల్ట్‌లో రూ. 3 కోట్లుకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయట. సలార్‌కు విడుదలైన రెండు రోజుల్లో సుమారు రూ. 20 కోట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కానీ, నాలుగో రోజు మాత్రం 13.64 కోట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
క్రిస్మస్ ఎఫెక్ట్?
అయితే నాలుగో రోజు సోమవారం కావడం, క్రిస్మస్ పండుగ రావడం కాస్తా మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది. కాగా రూ. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సలార్‌కు ఇంకా రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తే క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది.
టాపిక్