Best Web Hosting Provider In India 2024

Rajinikanth: ఈ ఏడాది జైలర్ సినిమాతో కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ బ్లాక్‍బాస్టర్ కొట్టారు. చాలా ఏళ్ల తర్వాత తన రేంజ్ హిట్ సాధించారు. కాగా, తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ స్పోర్ట్స్ డ్రామా లాల్ సలామ్ సినిమాలోనూ రజినీకాంత్ కీలక పాత్ర పోషించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రజీనీ.. మొయిద్దీన్ భాయ్ క్యారెక్టర్ చేశారు. కాగా, ఇప్పుడు లాల్ సలామ్ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని తెలుస్తోంది. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
లాల్ సలామ్ చిత్రాన్ని 2024 పొంగల్ (సంక్రాంతి)కు రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ కొంతకాలంగా చెబుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు రిలీజ్‍ను వాయిదా వేసేందుకు నిర్ణయించిందని తెలుస్తోంది. సంక్రాంతి రేసు నుంచి లాల్ సలామ్ మూవీ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కారణమిదే!
లాల్ సలామ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా పెండింగ్‍లో ఉన్నాయని తెలుస్తోంది. ఈ కారణంగానే రిలీజ్‍ను వాయిదా వేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. అందులోనూ సంక్రాంతికి ఈసారి చాలా సినిమాలో పోటీలో ఉన్నాయి. మరోవైపు 2024 జనవరి 26న లాల్ సలామ్ సినిమాను రిలీజ్ చేసే యోచనలోనూ మేకర్స్ ఉన్నట్టు టాక్. అయితే, ఇంకా ఈ డేట్‍ను అధికారికంగా ప్రకటించలేదు.
డైరెక్షన్‍కు కొన్నేళ్లు విరామం తీసుకున్న తర్వాత రజినీకాంత్ కూతురు ఐశ్వర్య.. లాల్ సలామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముంబై బ్యాక్‍డ్రాప్‍లో క్రికెట్, రాజకీయాల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది.
లాల్ సలామ్ చిత్రంలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా కనిపించనున్నారు. విఘ్నేశ్, లివింగ్‍స్టన్, సెంథిల్, జీవిత, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోష. వివేక్ ప్రసన్న, ధన్య బాలకృష్ణన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.