Best Web Hosting Provider In India 2024

Animal Movie: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ఈ ఏడాది బ్లాక్‍బాస్టర్ అయింది. భారీ కలెక్షన్లను సాధించింది. మితిమీరిన వైలెన్స్ ఉందని కొందరు విమర్శకులు అభిప్రాయపడినా.. థియేటర్లలో మాత్రం జనాలు యానిమల్‍కు జైకొట్టారు. దీంతో అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది యానిమల్. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.870కోట్ల గ్రాస్ కలెక్షన్‍ను రాబట్టిందని మూవీ యూనిట్ వెల్లడించింది. అయితే, యానిమల్ కలెక్షన్ల లెక్కల గురించి వెల్లడించిన సమాచారం నిజమేనా అని నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగాకు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు.
ట్రెండింగ్ వార్తలు
యానిమల్ సినిమా కలెక్షన్ల గురించి తాము ప్రకటించిన లెక్కలన్నీ కచ్చితమైనవేనని ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. బాలీవుడ్‍లో కార్పొరేట్ బుకింగ్స్ చేసే ట్రెండ్ ఉండడం వల్ల సినిమాల కలెక్షన్ల విషయంలో ఇటీవల అనుమానాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. తాము కార్పొరేట్ బుకింగ్స్ చేయలేదని చెప్పారు.
“మేం ప్రకటించిన ఆ నెంబర్లు (యానిమల్ కలెక్షన్లు) అన్నీ కచ్చితమైనవే. సాధారణంగా ఈ డౌట్లు ఎందుకు ఉన్నాయంటే.. బాలీవుడ్‍లో వారు కార్పొరేట్ బుకింగ్స్ చేసే ట్రెండ్ ఉంది. అది మేం చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా యానిమల్ సినిమా రూ.870 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది” అని ప్రణయ్ రెడ్డి వంగా చెప్పారు. ఒకవేళ కార్పొరేట్ బుకింగ్స్ చేసినట్టయితే యానిమల్ సినిమా రూ.1000కోట్ల మార్క్ దాటేదని ఆయన చెప్పారు.
కంపెనీలు గంపగుత్తగా డిస్కౌంట్లో సినిమా టికెట్లను కొనేసి.. ఉద్యోగులకు, సంబంధిత వ్యక్తులకు ఇవ్వడాన్ని కార్పొరేట్ బుకింగ్‍లుగా పరిగణిస్తారు. ఇటీవల కొన్ని బాలీవుడ్ సినిమాలు కార్పొరేట్ బుకింగ్‍లను ప్రోత్సహిస్తూ.. కలెక్షన్లను ఎక్కువ చేసి చూపుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. దాన్నే ఇప్పుడు ప్రణయ్ రెడ్డి వంగా ప్రస్తావించారు.
యానిమల్ సినిమాను వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. విలన్‍గా బాబీ డియోల్ చేశారు. అనిల్ కపూర్, తృప్తి డిమ్రి, శక్తికపూర్, బబ్లూ పృథ్విరాజ్ కీరోల్స్ చేశారు. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్ (టీ సిరీస్), ప్రణయ్ రెడ్డి వంగా (భద్రకాళి పిక్చర్స్), మురాద్ ఖేతానీ (సినీ1 స్టూడియోస్) నిర్మించారు.
సంబంధిత కథనం
టాపిక్