Best Web Hosting Provider In India 2024

Ranbir Kapoor – Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‍బీర్ కపూర్, ఆలియా భట్.. తమ కూతురు రాహా ముఖాన్ని తొలిసారి ప్రపంచానికి చూపించారు. క్రిస్మస్ సందర్భంగా నేడు (డిసెంబర్ 25) కపూర్ కుటుంబాల సభ్యులు ఒక్కచోటికి చేరి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ కూతురు ముఖాన్ని చూపారు రణ్‍బీర్, ఆలియా. ముంబైలోని జుహులో కపూర్ కుటుంబం లంచ్ పార్టీ జరిగింది.
ట్రెండింగ్ వార్తలు
2022 నవంబర్‌లో జన్మించిన రాహా ముఖాన్ని ఇప్పుడు తొలిసారి రివీల్ చేశారు రణ్‍బీర్ దంపతులు. రాహా పింక్, వైట్ డ్రెస్ వేసుకోగా.. ఆమెను రణ్‍బీర్, ఆలియా ఎత్తుకొని ఫొటోలకు పోజులు ఇచ్చారు. క్రిస్మస్ థీమ్ ఉన్న డ్రెస్‍ను ఆలియా ధరించారు. క్రిస్మస్ హెడ్ బ్యాండ్‍ను కూడా పెట్టుకున్నారు. బ్లాక్ ఔట్‍ఫిట్‍లో రణ్‍బీర్ కపూర్ స్టైలిష్‍గా కనిపించారు.
రాహా కళ్లు.. ఆయనలాగే
రణ్‍బీర్, ఆలియా దంపతుల కూతురు రాహా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాహాకు అచ్చం ముత్తాత రాజ్‍కపూర్ కళ్లు వచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాత రిషి కపూర్ పోలికలు కూడా వచ్చాయని అంటున్నారు. రాజ్‍కపూర్ మనవడు, రిషి కపూర్ కుమారుడే రణ్‍బీర్ కపూర్. రాహా చాలా క్యూట్‍గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
రణ్‍బీర్, ఆలియా భట్‍కు 2022 నవంబర్ 6న కూతురు రాహా జన్మించారు. అయితే, అప్పటి నుంచి ఆమె ముఖాన్ని బయటికి చూపించలేదు ఈ స్టార్ దంపతులు. అందుకు కారణాన్ని కూడా ఆలియా ఓ సందర్భంలో చెప్పారు. తాము కొత్తగా తల్లిదండ్రులయ్యామని, ఇంటర్నెట్‍లో ఆమె ఫొటోలు తిరుగుతుంటే తమకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అర్థం కాక ముఖం చూపించడం లేదని ఆమె అన్నారు. అయితే, ఎట్టకేలకు ఇప్పుడు రాహా ముఖాన్ని ప్రపంచానికి చూపించారు.
సినిమాల విషయానికి వస్తే, రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఆ చిత్రం రణ్‍బీర్ కెరీర్లోనే బెగ్గెస్ట్ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. ఇక, ఆలియా భట్ తదుపరి జిగ్రా చిత్రం చేస్తున్నారు.