Best Web Hosting Provider In India 2024

ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తి, సలహాదారు, వ్యూహకర్త, గురువు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. ఆయన తెలివితేటలు, నైపుణ్యం చాలా మందికి ఉపయోగపడ్డాయి. చాణక్యుడు తన సూత్రాలలో నేటికీ ప్రాచుర్యంలో ఉన్న అనేక విషయాలను రాశాడు. మీరు ఈ సూత్రాలను పాటిస్తే మిమ్మల్ని విజయాల మెట్లు ఎక్కకుండా ఎవరూ ఆపలేరు. ఆయన సూత్రాలను అనుసరించడం ద్వారా రోజువారీ జీవితంలో జరిగే అన్ని సమస్యల నుండి రక్షించుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
చాణక్యుడు ఆర్థిక, సాంగత్యం, వివాహం, సంపదతో సహా జీవితానికి సంబంధించిన వివిధ విషయాలను చర్చించాడు. చాణక్య నీతి స్త్రీ పురుషుల మధ్య సంబంధాల గురించి తెలుపుతుంది. అనేక విషయాలు కూడా ఇందులో ప్రస్తావించాడు. చాణక్యుడి రచనలు ఈ కాలానికి కూడా సరిపోయేలా ఉంటాయి. కొన్ని విషయాలలో పురుషుల కంటే స్త్రీలు ఉన్నతమైనవారని చాణక్యుడు చెప్పాడు. ఆ విషయాలు ఏంటో చూద్దాం..
ఆచార్య చాణక్యుడు పురుషుల కంటే స్త్రీలకు ఆకలి భావన ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఆహారం విషయంలో మహిళలు ముందుంటారు. చాణక్యుడి సూత్రాలు పురుషుల కంటే స్త్రీలు రెండింతలు ఆకలితో ఉంటారని చెబుతున్నాయి. దీనికి కారణం స్త్రీల శరీర నిర్మాణం. అందుకే మహిళలు బాగా తినాలని చెబుతారు.
పురుషును స్త్రీలు మించిపోవడానికి రెండో కారణం వారి తెలివితేటలు. స్త్రీలు పురుషుల కంటే తెలివైనవారు. మహిళల తెలివితేటలు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనుగడ సాగించగలవు. అందుకే కుటంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా స్త్రీ నెట్టుకురాగలదు. అదే ఈ విషయంలో పురుషుడు వెంటనే కంగారుపడిపోతాడు.
పురుషులు చాలా ధైర్యవంతులుగా కనిపిస్తారు. కానీ చాణక్య నీతి ప్రకారం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ధైర్యం కలిగి ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా భయపడని గుణం మహిళలకు ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ఒత్తిడి, మరియు ఓర్పు విషయంలో పురుషుల కంటే స్త్రీలు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. కాస్త ఒత్తిడి అయినా పురుషులు తట్టుకోలేరు. కానీ స్త్రీల మాత్రం ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఆలోచిస్తారు.
పురుషుల కంటే స్త్రీల లైంగికత ఎక్కువ. చాణక్య ప్రకారం స్త్రీలలో లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఇంద్రియాలను కలిగి ఉంటాయి. స్త్రీలు లైంగికంగా పురుషులతో పోల్చితే 8 రెట్లు ఎక్కువ చురుకుగా ఉంటారు. దీనివల్ల పురుషుల్లో లైంగిక భావాలు తక్కువగా ఉంటాయని చెప్పక తప్పదు. అందుకే ఆడవాళ్లు ఆ విషయంలో ఎక్కువ ఆసక్తితో ఉంటారు. ఎంత గొప్ప మగాడైనా స్త్రీని తృప్తి పరచాలంటే చాలా కష్టం.