Best Web Hosting Provider In India 2024

Umapathi Release Date: 2023 చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద తన లక్‌ను పరీక్షించుకునేందుక సిద్ధమైంది అవికాగోర్. ఆమె హీరోయిన్ నటించిన ఉమాపతి మూవీ డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో అనురాగ్‌తో అవికాగోర్ రొమాన్స్ చేస్తోంది. లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఉమాపతి సినిమాకు సత్య ద్వారపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఉమాపతి మూవీలో పదహారణాల పల్లెటూరి అమ్మాయిగా అవికాగోర్ కనిపించబోతున్నది ఉమాపతి సినిమాలో. ప్రేమకథతో పాటు తండ్రీకొడుకుల నేపథ్యంలో వచ్చే సీన్స్ నవ్విస్తూనే భావోద్వేగాలకు గురిచేస్తాయని డైరెక్టర్ సత్వ ద్వారపూడి చెబుతోన్నాడు.
సెన్సార్ నుంచి ఉమాపతి సినిమాకు యూ. ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈమూవీకి ఫిదా మూవీ ఫేమ్ శక్తి కాంత్ కార్తిక్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు.
ఉమాపతి సినిమాలో పోసాని కృష్ణమురళి, శివన్నారాయణతో పాటు జబర్ధస్త్ ఆటో రాంప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అవికాగోర్ తెలుగులో పాప్‌కార్న్ మూవీతో పాటు వధువు, మాన్షన్ 24 అనే వెబ్‌సిరీస్‌లు చేసింది.
టాపిక్