Best Web Hosting Provider In India 2024

అసలే వచ్చేది కొత్త సంవత్సరం. ఈ సమయం అందరికీ ఆకర్షణీయంగా కనిపించాలి. కానీ బరువు ఎక్కువగా ఉన్నామని చాలా మంది ఫీలవుతారు. అధిక కొవ్వు గురించి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతారు. త్వరగా బరువు తగ్గాలంటే ఈ ప్రత్యేక చిట్కాలను పాటించండి. అల్పాహారంలో కొన్ని ఆహారాలను చేర్చండి. ఒక వారంలో అదనపు కొవ్వు తగ్గుతుంది.
ట్రెండింగ్ వార్తలు
మీరు రోజు ప్రారంభంలో నిమ్మ, తేనె నీరు తాగవచ్చు. గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె, సమాన పరిమాణంలో నిమ్మరసం కలిపి సిరప్ తయారు చేయండి. ఖాళీ కడుపుతో దీన్ని తాగితే లాభాలు వస్తాయి. శరీరానికి కూడా ఇది చాలా మంచిది. ఉదయం తీసుకోవడం వలన పొట్ట శుభ్రం అవుతుంది.
మీరు మెంతి నీరు కూడా తాగవచ్చు. 1 టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. దీన్ని వడకట్టి ఉదయాన్నే తాగాలి. దీని ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు జుట్టు ఆరోగ్యానికి కూడా మెంతి నీరు ఎంతగానో పనికి వస్తుంది. కావాలంటే కొన్ని రోజులు ట్రై చేసి చూడండి.
అలోవెరా జ్యూస్‌లో కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద రసం కొనడానికి అందుబాటులో ఉంది. లేదా కలబంద ఆకులను కోసి అందులోని జెల్‌ని తీసి జ్యూస్‌గా చేసుకోవాలి. మీరు దీని వల్ల ప్రయోజనం పొందుతారు. ఇంట్లోనూ కలబంద మెుక్కు పెంచుకుని మీరే ఈ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. బరువు కోసమే కాదు.. దీని ద్వారా చాలా ప్రయోజనాలు పొందుతారు.
దోసకాయను కూడా బరువు తగ్గేందుకు తినవచ్చు. ప్రతిరోజూ ఉదయం దోసకాయ తినండి. దీన్ని తినడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. దానితో డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకం సమస్యను కూడా పోయేలా చేస్తుంది. కడుపు క్లీన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
యాపిల్స్ తినడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. యాపిల్స్ లో ఫైబర్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు ప్రతిరోజూ ఆపిల్ తినవచ్చు. ఉదయాన్నే తినండి. పెద్దలు కూడా యాపిల్ తింటే చాలా సమస్యల నుంచి బయపడొచ్చని చెబుతారు.
రోజూ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగండి. క్యారెట్‌లు, దుంపలను తరిగి జ్యూస్ చేయాలి. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పొట్టను శుభ్రం చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోపడుతుంది.
మీరు శనిగలు కూడా తినవచ్చు. ఉదయాన్నే చిక్పీస్ తింటే లాభాలు ఉంటాయి. ఇందులో అధిక ప్రొటీన్ ఉంటుంది. బరువు తగ్గడంతో పాటు శరీరంలోని అన్ని లోపాలను భర్తీ చేస్తుంది. ఈ చిట్కాలను అనుసరించండి. ప్రయోజనం పొందుతారు. ఈ ఆహారాలలో కొన్నింటిని మీ అల్పాహారంలో చేర్చుకోండి. కొత్త సంవత్సరం వేడుకలు ముగిసేలోపు మీరు అదనపు కొవ్వును తగ్గించుకోవచ్చు.