Best Web Hosting Provider In India 2024

Brahmamudi Today Episode: కావ్య, స్వప్న కలిసి అరుణ్‌ను పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. వారికి పద్మావతి సాయం చేస్తుంది. కానీ ముగ్గురిని తోసేసి పారిపోయేందుకు అరుణ్ ప్రయత్నిస్తాడు. సడెన్‌గా అక్కడికి ఎంట్రీ ఇచ్చిన కనకం కర్రతో అతడి తలపై గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకు అరుణ్ స్పృహ కోల్పోతాడు. కళ్యాణ్ పెళ్లి జరిగే వరకు అతడిని రిసార్ట్‌లోని ఓ రూమ్‌లో కట్టిపడేయాలని ఫిక్స్ అవుతారు.
ట్రెండింగ్ వార్తలు
రాహుల్ టెన్షన్…
పెళ్లి వేడుకలో అరుణ్ కనిపించకపోవడంతో రుద్రాణి, రాహుల్ కంగారుపడిపోతారు. కావ్యకు దొరికిపోయాడని భయపడతారు. అరుణ్‌కు ఫోన్ చేస్తాడు రాహుల్. ఎవరు ఫోన్ చేశారో కావ్య చూడాలని అనుకునే లోపు ఫోన్ స్విఛాఫ్ అవుతుంది. పద్మావతి చేసిన సాయానికి ఆమె ప్రతిసాయం చేయాలని స్వప్న, కావ్య ఫిక్సవుతారు. ఇదే పెళ్లి వేడుకలో మురళి నిజ స్వరూపం బయటపెట్టి విక్రమాదిత్య, పద్మావతిలను ఒక్కటి చేయాలనుకుంటారు.
అనామిక అలక…
పెళ్లి వేడుకలో అప్పుతో కళ్యాణ్ క్లోజ్‌గా ఉండటం అనామిక తట్టుకోలేకపోతుంది. కళ్యాణ్‌పై అలిగి అతడితో మాట్లాడదు. అనామికను చాలా సేపు బతిమిలాడుతాడు కళ్యాణ్. చివరకు అప్పు చేతికి వేసిన మెహందీని ఎందుకు పొగిడావని కళ్యాణ్‌ను నిలదీస్తుంది అప్పు. అనామిక కోసం ఎందుకు తెలుసుకున్న కళ్యాణ్ ఆమెకు సారీ చెబుతాడు కళ్యాణ్.
ట్రాజెడీ స్టోరీ…
విక్రమ్‌ను తీసుకొని రిసార్ట్‌లో ఉన్న బార్‌కు వస్తాడు రాజ్. పద్మావతితో నీ పెళ్లి ఎప్పుడు, ఎలా జరిగిందో చెప్పమని విక్రమ్‌ను అడుగుతాడు రాజ్. అదొక ట్రాజెడీ అంటూ రాజ్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు విక్రమాదిత్య. పెళ్లి గురించి కాకుండా మరో టాపిక్ మాట్లాడుకుందామని అంటాడు. వారు తాగాల్సిన గ్లాస్‌లు మారిపోవడంతో మాక్‌టెయిల్ బదులూ మందు తాగుతారు. మత్తులో మునిగిపోతారు. రాజ్, విక్రమ్ కనిపించకపోవడంతో కావ్య, పద్మావతి వారి కోసం వెతుకుంటారు.
పద్మావతి ప్రేమలో విక్రమ్…
తాగిన మత్తులో పద్మావతిని ప్రాణంగా ప్రేమించినట్లు మనసులోని మాటను బయటపెడతాడు విక్రమ్. తనది మంచి మనసు అని చెబుతాడు. పద్మావతిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నానని అంటాడు. కానీ పద్మావతి తనను మోసం చేసిందని రాజ్‌కు చెబుతూ విక్రమ్ ఎమోషనల్ అవుతాడు. మరోవైపు చేయని తప్పుకు భర్త ముందు తాను అపరాధిగా మారినట్లు కావ్యతో అంటుంది పద్మావతి.
రాజ్ కన్ఫ్యూజన్…
ఆ తర్వాత తన పెళ్లి గురించి విక్రమ్‌కు చెబుతాడు రాజ్. కావ్యకు తనపై ఉన్నది ప్రేమో, కాదో తెలియని కన్ఫ్యూజన్‌లో ఉన్నానని అంటాడు. కావ్య మంచిదని చెబుతాడు. ఎవరి మనసును కష్టపెట్టదని ప్రశంసిస్తాడు. మరోవైపు రాజ్‌ను తాను చాలా ప్రేమిస్తున్నట్లు పద్మావతితో చెబుతుంది కావ్య. తన ప్రేమను నటన అని రాజ్ భ్రమపడుతున్నాడని బాధ పడుతుంది.
కావ్య వార్నింగ్…
అరుణ్ మిస్సవడంతో రాహుల్, రుద్రాణి టెన్షన్ పడతారు. అరుణ్ రిసార్ట్ నుంచి బయటకు వెళ్లలేదని, లోపలే ఎక్కడు ఉన్నాడని తెలియడంతో వారి భయం మరింత పెరుగుతుంది.రిసార్ట్‌లో ఎంత వెతికినా అతడి జాడ వారికి కనిపించదు.
రాజ్, విక్రమ్ తెచ్చిన కాక్‌టెయిల్‌ను పొరపాటుగా పద్మావతి, కావ్య తాగుతారు. వారు కూడా మత్తులో తూలిపోతారు. తాగిన మత్తులో నీ మనసు నా దగ్గర భద్రంగా ఉందని, ఆ మనసును ఎవరైన టచ్ చేయాలని చూస్తే చంపేస్తానని కావ్య అంటుంది. మీరంటే నాకు చాలా ఇష్టమని అంటుంది. తాగిన మత్తులో రాజ్ పట్ల తన మనసులో ఉన్న ఇష్టం మొత్తం చెప్పేస్తుంది కావ్య. విక్రమ్ కూడా పద్మావతి అంటే తనకు ఎంత ఇష్టమో చెబుతాడు. అక్కడితో నేటి మహాసంగమం సీరియల్ ముగిసింది.