Best Web Hosting Provider In India 2024

Jagtial News : తెలంగాణ పెళ్లి తంతులో మటన్ కామన్. మటన్ తక్కువైందనో, నల్లి బొక్క లేదనో గొడవలకు దారితీసిన ఘటనలూ ఉన్నాయి. ఇటీవల విడుదల బలగం సినిమాలో నల్లి బొక్క కోసం జరిగిన గొడవ కథనాన్ని నడిపింది. ఇలాంటి ఘటన ఇటీవల జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ఓ అబ్బాయికి నిజామాబాద్ కి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. వీరికి నవంబరులో నిశ్చితార్థం సందర్భంగా… అమ్మాయి ఇంట్లో నిశ్చితార్థం భోజనాలు ఏర్పాటు చేశారు. అప్పుడు అబ్బాయి తరపు బంధువులు మూలుగ(నల్లి) బొక్క కావాలని అడిగారు. నల్లి బొక్కలు లేవని చెప్పడంతో అబ్బాయి, అమ్మాయి బంధువులకు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దదై చివరికి పెళ్లి రద్దు చేసుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటి కావలసిన ఆ కుటుంబాల మధ్య నల్లి బొక్క చిచ్చుపెట్టింది.
ట్రెండింగ్ వార్తలు
అసలేం జరిగింది?
మటన్‌లో నల్లి బొక్క విషయంలో వరుడు, వధువు తమ్ముడి మధ్య గొడవ జరిగి చివరకు పెళ్లి క్యాన్సిల్‌కు దారితీసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులు, జగిత్యాల జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఇటీవలే వధువు ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నిశ్చితార్థం అనంతరం వధువు కుటుంబ సభ్యులు వరుడి కుటుంబ సభ్యులు, బంధువులకు నాన్ వెజ్ భోజనాలు పెట్టారు. అంతా బాగానే సాగుతున్న సమయంలో మటన్ నల్లి బొక్క వడ్డించలేదని వరుడి బంధువులు అడిగారు. వంటవాళ్లు నల్లి బొక్క ఎక్కువగా వేయలేదని వధువు బంధువులు చెప్పారు. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది.
చివరికి పెళ్లి రద్దు
చివరకి ఈ సమస్య స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. వరుడి తరఫు బంధువులకు సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే మాంసాహార వంటల్లో నల్లి బొక్క వడ్డించకుండా వధువు కుటుంబీకులు తమను అవమానించారని వరుడి బంధువులు వాదించారు. మటన్ బొక్కలు కావాలని వరుడు కుటుంబ సభ్యులు ముందుగా చెప్పలేదని , అందుకు వంటకాల్లో వాటిని కలపలేదని వధువు కుటుంబీకులు తెలిపారు. చివరికి ఈ సమస్య పెళ్లి క్యాన్సిల్‌కు దారితీసింది. నల్లి బొక్క కోసం పెళ్లి రద్దు చేసుకుని ఇరువర్గాలు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారని తెలిసి పోలీసులతో పాటు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న విషయానికి గొడవ పడి ఏకంగా పెళ్లి రద్దు చేసుకోవడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు.