Best Web Hosting Provider In India 2024

AP Endowment Engineering Posts : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో 70 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 5 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నియామక ప్రక్రియను ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా చేపట్టనుంది. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ అర్హత సాధించి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరి రిజర్వేషన్లను అమలు చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్ escihyd.orgలో అందుబాటులో ఉంది. అభ్యర్థుల గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి.
ట్రెండింగ్ వార్తలు
ఖాళీలు
- ఏఈఈ(సివిల్)- 35
- ఏఈఈ(ఎలక్ట్రికల్)-5
- టెక్నికల్ అసిస్టెంట్(సివిల్)-30
పరీక్షా విధానం
రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో 80 మార్కులకు ఇంజినీరింగ్ అంశాలపై ప్రశ్నలు, పది మార్కులకు ఇంగ్లిష్, మరో పది మార్కులకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న ఆలయాల నిర్మాణాలకు అనుగుణంగా…కాంట్రాక్టు విధానంలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ చేపడుతున్నట్టు దేవాదాయ శాఖ పేర్కొంది.
అర్హతలు
ఏఈఈ (సివిల్) అభ్యర్థులు తప్పనిసరిగా బీఈ/బీటెక్ డిగ్రీ (సివిల్) కలిగి ఉండాలి. ఏఈఈ (ఎలక్ట్రికల్) అభ్యర్థులు తప్పనిసరిగా బీఈ/బీటెక్ డిగ్రీ (ఎలక్ట్రికల్) కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ హార్డ్ కాపీని- కన్వీనర్, రిక్రూట్‌మెంట్ సేవలు, పవర్ & ఎనర్జీ డివిజన్, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఓల్డ్ బాంబే రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్ – 500 032 చిరునామాకు పోస్టు చేయాలి. హైదరాబాద్‌లో పేయబుల్ “IE(I)- Engineering Staff College of India”కి పేరు మీద రూ.500 డీడీ తీసి స్వీయ ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు ఫామ్‌ను పోస్ట్ లేదా కొరియర్ పంపించాలి.