Best Web Hosting Provider In India 2024

Venky 75: విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. చాలా రోజుల తర్వాత వెంకటేశ్ యాక్షన్ మూవీ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ 1, హిట్ 2 చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తుండటం వల్ల కూడా సైంధవ్‍పై క్రేజ్ బాగా ఉంది. కాగా, వెంకటేశ్‍కు ఇది 75వ సినిమాగా ఉండనుంది. ఈ స్పెషల్ మైల్‍స్టోన్‍ను సెలెబ్రేట్ చేసేందుకు సైంధవ్ మేకర్స్ నిర్ణయించారు.
ట్రెండింగ్ వార్తలు
తన అద్భుతమైన సినీ కెరీర్లో విక్టరీ వెంకటేశ్ 75 సినిమాకు చేరిన సందర్భంగా వెంకీ75 (Venky75) పేరుతో ఓ ఈవెంట్ జరగనుంది. దీన్ని భారీగా నిర్వహించాలని సైంధవ్ మేకర్స్ నిర్ణయించారు. రేపు (డిసెంబర్ 27) హైదరాబాద్‍లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 5 గంటల నుంచి వెంకీ75 ఈవెంట్ జరగనుంది. హీరో దగ్గుబాటి రానా ఈ ఈవెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. వెంకటేశ్ 1986లో కలియుగ పాండవులు సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరోకు 75వ చిత్రానికి ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారిగా ఉంది.
అతిథులు వీరే!
వెంకీ75 వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, ప్రభాస్, నాగార్జున సహా మరికొందరు హాజరవుతారని తెలుస్తోంది. యంగ్ హీరోలు కూడా చాలా మంది వస్తారని తెలుస్తోంది. అలాగే కలియుగ పాండవులు నుంచి ఇప్పటి సైంధవ్ వరకు వెంకటేశ్‍తో కలిసి పని చేసిన నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు సహా టెక్నిషియన్లకు ఆహ్వానం వెళ్లినట్టు తెలుస్తోంది. దర్శకులు కే.రాఘవేంద్ర రావు, బి.గోపాల్, ముప్పలనేని శివ సహా వెంకటేశ్‍తో కలిసి పని చేసిన చాలా మంది డైరెక్టర్లు ఈ ఈవెంట్‍కు రానున్నారు.
వెంకీ75 ఈవెంట్ కోజ్డ్ డోర్ ఈవెంట్‍గా ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఆహ్వానం అందిన అతిథులు, ఎంపిక చేసిన కొందరు అభిమానులకు మాత్రమే ఈ ఈవెంట్‍కు వెళ్లే అవకాశం ఉండనుంది. అలాగే, ఈ వేడుక లైవ్ ఉంటుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. కొన్ని రోజుల తర్వాత ఈటీవీలో ఈ వెంకీ75 వేడుక టెలికాస్ట్ అవుతుందని టాక్.
సైంధవ్ సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో యాక్షన్ మోడ్‍లో వెంకటేశ్ అదరగొట్టారు. కూతురు సెంటిమెంట్ కూడా ఈ చిత్రంలో ఉండనుంది. జనవరి 13న రిలీజ్ కానున్న సైంధవ్‍పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. నిహారిక ఎంటర్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
సంబంధిత కథనం