Best Web Hosting Provider In India 2024

Allu Arjun -Atlee movie: పుష్ప -2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ ఎవరన్నది టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్, సందీప్ వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు కమిటయ్యాడు. ఈ ఇద్దరు దర్శకులతో పాటు మరికొందరు పాన్ ఇండియన్ డైరెక్టర్లతో అల్లు అర్జున్ సినిమా ఉండనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
జవాన్‌తో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్, అట్లీ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
అట్లీ మూవీతోనే అల్లు అర్జున్ అఫీషియల్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అల్లు అర్జున్, అట్లీ మూవీ రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, అట్లీ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం.
త్రివిక్రమ్ మూవీ ఆలస్యం…
పుష్ప -2 తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో బన్నీ పాల్గొనున్నట్లు వార్తలొచ్చాయి. సోషియా ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ చేయనున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో కథను సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. త్రివిక్రమ్ మూవీ స్థానంలో అట్లీ మూవీని సెట్స్‌పైకి తీసుకురాలని బన్నీ ఆలోచనలో ఉన్నట్లు చెబుతోన్నారు.
పుష్ప 2 నెక్స్ట్ షెడ్యూల్
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో బన్నీ బిజీగా ఉన్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నలపై కొన్ని కీలకమైన సీన్స్ చిత్రీకరించాడు డైరెక్టర్ సుకుమార్. జనవరి 4 నుంచి ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానున్నట్లు సమాచారం. 2024 ఆగస్ట్‌లో పుష్ప -2 రిలీజ్ కానుంది.