Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari december 26th: కృష్ణ ఒంటరిగా కూర్చుని భవానీ అన్న మాటల గురించి బాధపడుతూ ఉంటుంది. పెద్దత్తయ్యకి రోజురోజుకీ మా మీద కోపం పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. తన వాలకం చూస్తుంటే మా తప్పు లేకపోయినా మా బంధాన్ని విడదీసేలాగా ఉందని బాధపడుతుంది. అప్పుడే మురారి వస్తాడు. జరిగిన దానికి సోరి చెప్తాడు. ఇప్పుడేమైందని చెప్తున్నారని అంటుంది. ఎంతో ప్రేమగా నువ్వు కూర తీసుకుని వస్తే వాళ్ళు అలా చేయడం నచ్చలేదని మురారి కూడా బాధపడతాడు.
ట్రెండింగ్ వార్తలు
పెద్దత్యయ్య మీద కోపం పెంచుకోవద్దని కృష్ణ సర్ది చెప్తుంది. అక్కడ ఉండబుద్ధి కావడం లేదు ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుందని మురారి బాధపడతాడు. బాగా బాధపడుతున్నారు ఎలాగోకలా తన మూడ్ మార్చాలని కృష్ణ అనుకుంటుంది. ఇద్దరూ ప్రేమగా ఒకరికొకరు అన్నం తినిపించుకుంటారు. భర్త ప్రేమ చూసి మురిసిపోతుంది. నిన్ను పెద్దమ్మ కాని ఎవరైనా ఏమైనా అంటే పట్టించుకోవద్దు నీకు నెనున్నానని కృష్ణకి భరోసా ఇస్తాడు. ఇంకొన్ని రోజుల్లో ఈ కేసు క్లోజ్ చేస్తాను ఇక మనకి అడ్డుపడే వాళ్ళు ఎవరూ ఉండరని అంటాడు.
కృష్ణ తన భార్య అని చెప్పిన మురారి
మురారి నిద్రపోతుంటే ముకుంద వస్తుంది. నీగురించి నేను ఎన్ని అవమానాలు పడుతున్నానో, ఎంత తపన పడుతున్నానో నీకు అర్థం కావడం లేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటావోనని మనసులోనే ముకుంద అనుకుంటుంది. మురారిని పిలిచి నిద్రలేపుతుంది. నువ్వు ఎందుకు కాఫీ తీసుకొచ్చావని అడుగుతాడు. మూడు రోజుల్లో మన పెళ్లి అది గుర్తుందా అని అంటుంది. గుర్తుంది కానీ నేను ఇలాగే మాట్లాడతానని తనని చూసి చిరాకు పడతాడు. మీ పెద్దమ్మ ఏం చెప్పిందో గుర్తుందా అని మరోసారి అడుగుతుంది.
ఏం చెప్పింది ఈ కేసులో దోషులు ఎవరో కనిపెట్టమని చెప్పింది అంతే కదా ఆ పనిలోనే ఉన్నాను. అది తేల్చలేవని చెప్పాను కదా కృష్ణ వాళ్ళే తప్పు చేశారని చెప్పాను కదా. వచ్చే శుక్రవారం మన పెళ్లి జరుగుతుంది గుర్తు పెట్టుకోమని ముకుంద చెప్తుంది. నువ్వు గుర్తు పెట్టుకో కృష్ణ ఏ నేరం చేయలేదని నిరూపిస్తానని అంటాడు. అసలు నిన్ను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావని అంటుంది. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావ్.. ఈ పెళ్లి మీ నాన్నకి, అన్నయ్యకి ఇష్టం లేదు. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించు నీకే అర్థం అవుతుందని చెప్తాడు.
అంత అంథకారంలో ఉంది మీరు.. ఎప్పుడు కృష్ణతో ఉండటానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నీ వెనుకాల నేను కుక్కపిల్లలా తిరుగుతుంటే బాగోదని చెప్తుంది. అయినా నా భార్య వెనుక నేను తిరిగితే ఏంటని మురారి అడుగుతాడు. మురారి ఇంకా కేసు తేలలేదు. కృష్ణ నీ భార్య ఎలా అవుతుందని ప్రశ్నిస్తుంది. ఎప్పటి నుంచో మేము భార్యాభర్తలం అది నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిదని చెప్తాడు. అది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిదని ధీటుగా సమాధానం ఇస్తుంది. ఏమైంది నీకు నన్ను ప్రేమించావ్, మనం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని అంటుంది.
ముకుందతోనే మురారి పెళ్ళా?
అది గతం నేను నా ఫ్రెండ్ ని మోసం చేయలేను. అది మోసం కాదు ప్రాయశ్చిత్తం అవుతుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ప్రాయశ్చిత్తం అవుతుంది. మరి కృష్ణని వదిలేస్తే తనని మోసం చేసిన దానికి ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అంటాడు. నువ్వు కృష్ణని మోసం చేయడం ఏంటి? ఆ కృష్ణ మనందరిని మోసం చేసింది. నిన్ను చావు దాకా తీసుకెళ్లిందని అబద్ధం చెప్తుంటే అడ్డుపడతాడు. నిజం తేలే వరకు నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కృష్ణ దగ్గరకి వెళ్ళిపోతాడు. కృష్ణ పూజ చేసుకుంటూ భవానీ అత్తయ్య తమని అర్థం చేసుకునేలా చేయమని దేవుడిని కోరుకుంటుంది.
మురారి కృష్ణ దగ్గరకి చిరాకుగా వస్తాడు. ఏంటి చిరాకుగా ఉన్నారు ఏమైందని అడుగుతుంది. ముకుంద చిరాకు తెప్పిస్తుందని అంటాడు. సోరి కృష్ణ ఇలాంటి టాపిక్ నీ దగ్గర తీసుకురాకూడదు. కానీ నా బాధ సంతోషం నీతోనే కదా నేను షేర్ చేసుకునేదని అంటాడు. కృష్ణ రెండు వేళ్ళల్లో ఒకటి పట్టుకోమని చెప్తుంది. మురారి వేలు పట్టుకుంటే అయ్యో మీకు, ముకుందకి పెళ్లి జరుగుతుందని అనుకున్న వేలు పట్టుకున్నారా అని అంటుంది. జరగని వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావని చెప్తాడు.
వేరు కాపురం పెడదామన్న మురారి
శుక్రవారం తర్వాత అమ్మ, నేను, నువ్వు వేరే ఇల్లు తీసుకుంటే ఎలా ఉంటుందని మురారి అంటాడు. చండాలంగా ఉంటుంది ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడటం బాగోదని కృష్ణ చెప్తుంది. నువ్వు నాకు దొరకడం నా అదృష్టమని మురారి మురిసిపోతాడు. ముకుంద భవానీ దగ్గరకి వచ్చి డ్రామా స్టార్ట్ చేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఇదివరకు మీ మాట అంటే మురారికి శిలాశాసనం. కానీ ఇప్పుడు కృష్ణ మాట అంటే శిలాశాసనం. నేను కాఫీ ఇద్దామని మురారి దగ్గరకి వెళ్ళాను. కానీ మన ఇద్దరినీ వెధవలని చేసి మాట్లాడాడు. కృష్ణ ఒక్కతే అమాయకురాలు, మనం తన జీవితం నాశనం చేసినట్టు మాట్లాడాడు. నేను తీసుకొచ్చిన కాఫీ కూడా తాగకుండా వెళ్లిపోయాడని చెప్తుంది.
ఎక్కడని వెళ్లాడని అడుగుతుంది. కృష్ణ దగ్గరకి వెళ్తున్నానని చెప్పేసి వెళ్లాడని అంటుంది. భవానీ కాఫీ ఇమ్మని రేవతిని అడుగుతుంది. కృష్ణ ఫోన్ చేసి కాఫీ తీసుకొస్తానని చెప్పిందని చెప్తుంది. మన విషయాల్లో తనని జోక్యం చేసుకోవద్దని చెప్పమని అంటాడు. మధుకర్ ని పిలిచి అవుట్ హౌస్ కి కాల్ చేయమని చెప్పే లోగా ఆత్రంగా కృష్ణకి ఫోన్ చేసి కాఫీ తీసుకురమ్మని చెప్పాలా అంటాడు. దీంతో భవానీ కోపంగా చెంప చెల్లుమనిపిస్తుంది. అప్పుడే మురారి, కృష్ణ ఇంట్లోకి వస్తారు. ఎందుకు మధుని కొట్టావని మురారి అడుగుతాడు. పనికిమాలిన పని చేశాడని వెటకారంగా చెప్తుంది.
రేపటి ఎపిసోడ్ లో కృష్ణని మురారి బయటకి పిలుస్తాడు. వస్తున్నా అంటూ పరిగెడుతూ కృష్ణ కాలు స్లిప్ అవుతుంది. నడవలేక ఇబ్బంది పడుతుంటే తనని ఎత్తుకుని మురారి ఇంటికి తీసుకురావడం భవానీ వాళ్ళు చూసి షాక్ అవుతారు.