సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..


ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.16-7-2022 (శనివారం) ..

సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

కంచికచర్ల పట్టణంలోని భావన ధియేటర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సిసి డ్రైనేజీ ల నిర్మాణ పనులను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శనివారం పరిశీలించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సిసి డ్రైనేజీల నిర్మాణ పనులను చేపట్టామని , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మౌనిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు ,

అదేవిధంగా కంచికచర్ల పట్టణంలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటు – సీసీ డ్రైనేజీలు -సిసి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని , కంచికచర్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు , అదేవిధంగా డ్రైనేజీల నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ,

ఈ కార్యక్రమంలో కంచికచర్ల ఉపసర్పంచ్ వేమా సురేష్ బాబు మరియు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *