Best Web Hosting Provider In India 2024

AP Anganwadi Protest : వేతనాలు పెంచాలని ఏపీలో అంగన్వాడీలు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజు రోజుకు సమ్మె ఉద్ధృతం అవుతుండడంతో ఎట్టకేలకు ప్రభుత్వం… అంగన్వాడీలను చర్చలు పిలించింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది. ఏఐటీయూసీతో పాటు మరో రెండు సంఘాలకు ప్రభుత్వం చర్చలకు రావాలని ఆహ్వానం పంపింది. వేతనాల పెంపు కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అయితే వేతనాలు పెంపు తప్ప మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం అంటోంది.
ట్రెండింగ్ వార్తలు
కనీసం వేతనం రూ.26 వేలు పెంచాలని డిమాండ్
వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీ పక్కన పెట్టారని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ఆ హామీని అమలు చేయాలని అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వేతన పెంపు మినహా ఇతర అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. అయితే గతంలో రెండు సార్లు చర్చలు జరిగినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని అంగన్వాడీ సంఘాలు అంటున్నాయి. ఇవాళ్టి చర్చల్లోనైనా స్పష్టం వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని అంగన్వాడీలు కోరుతున్నారు. ఇవాళ ఆకలి కేకలు పేరుతో అన్ని దీక్షా శిబిరాల్లో పల్లెం, గరిటలతో మోత మోగించాలని అంగన్వాడీలు నిర్ణయించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్
ఏపీలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె సైరన్ మోగించారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దాదాపు 50 వేల మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన సమ్మెచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం రూ. 26 వేలకు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో చుట్టు పక్కల గ్రామాలను విలీనం చేయడంతో పని ఒత్తిడి పెరిగిందని కార్మికులు అంటున్నారు. పనికి తగిన వేతనం ఇవ్వడంలేదని ఆవేదన చెందుతున్నారు. కార్మికుల సంఖ్యను పెంచడం లేదని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారని అంటున్నారు. పెరిగిన పని ఒత్తిడికి తగిన విధంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిరసనలకు దిగారు. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి రూ.15 వేల వేతనం, వెల్త్ ఎలవెన్స్ కింద రూ.6 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.