
Best Web Hosting Provider In India 2024

Telugu Movies: 2023 ఏడాదికి గుడ్‌బై చెప్పడంతో పాటు 2024కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు వారసులు రెడీ అవుతోన్నారు. ఈ వారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల్ని అలరించేందుకు కళ్యాణ్ రామ్ డెవిల్‌తోపాటు బబుల్ గమ్, సర్కారు నౌకరి సినిమాలు సిద్ధమయ్యాయి. వాటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఈ వీక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
ట్రెండింగ్ వార్తలు
స్పై పాత్రలో కళ్యాణ్ రామ్…
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తోన్నాడు.
డెవిల్‌లో బ్రిటీష్ రెసెడెన్సీ కాలం నాటి స్పై పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలుత నవంబర్ 24న డెవిల్ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో డిసెంబర్ 29కి సినిమా రిలీజ్ వాయిదాపడింది. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో డెవిల్‌పైనే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
రోషన్ కనకాల బబుల్‌గమ్
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తోన్న బబుల్ గమ్ మూవీ కూడా ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నాడు. మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్స్, టీజర్స్‌తో యూత్ ఆడియెన్స్‌లో బబుల్ గమ్ మూవీ క్యూరియాసిటీని కలిగించింది.
ఈ రెండు సినిమాలతో అవికాగోర్ ఉమాపతి కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సత్య ద్వారపూడి ఉమాపతి మూవీని తెరకెక్కించాడు. ఉమాపతితో పాటు కరెన్సీ నగర్, బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫర్ ఈ ఏడాది చివరి వారంలో ప్రేక్షకలు ముందుకు రానున్నాయి.
జనవరి 1న సర్కారు నౌకరీ
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సర్కారు నౌకరి జనవరి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న సర్కారు నౌకరి సినిమాను సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు నిర్మించాడు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో భావన హీరోయిన్‌గా నటిస్తోంది.
టాపిక్