Best Web Hosting Provider In India 2024

Salt Intake: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సోడియం తీసుకోవడం తగ్గించాలి. సోడియం తగ్గించాలంటే ఆహారంలో ఉప్పును తక్కువగా వేసుకోవాలి. అధిక ఉప్పు వినియోగం అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఉప్పుని తగ్గిస్తే ఆహారం రుచి కూడా తగ్గిపోతుందని చాలామంది అనుకుంటారు. ఉప్పును తగ్గించినా కూడా ఆహారం రుచి తగ్గకుండా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలను పాటించాలి. ఉప్పుకు బదులు కొన్ని ఇతర ఆహార పదార్థాలను వేయడం ద్వారా రుచి మారకుండా చూసుకోవచ్చు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా పనిచేసే కొన్ని పదార్థాలు ఇదిగో.
ట్రెండింగ్ వార్తలు
నిమ్మరసం
నిమ్మరసం అనేది వంటకానికి రుచిని పెంచుతుంది. ఉప్పుకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉంటుంది. నిమ్మరసంలో ఆమ్లత్వం ఉంటుంది. ఉప్పుతో సమానమైన రుచిని అందిస్తుంది. వండిన ఆహారంపై నిమ్మరసాన్ని చల్లడం వల్ల రుచి బాగుంటుంది. చప్పగా అనిపించదు.
ఉల్లిపాయ పొడి
ఎండిన ఉల్లిపాయలను పొడిలా చేసి స్టోర్ చేసుకోవాలి. సూపులు, వేపుళ్ళు, సలాడ్లు వంటి వాటిలో ఉప్పుకు బదులు దీన్ని వేసుకుంటే రుచి బాగుంటుంది. ఒక స్పూన్ వేయాల్సిన చోట అర స్పూన్ వేసుకోవడం అలవాటు చేసుకోండి. దాని బదులు ఉల్లిపాయ పొడిని చల్లుకోండి. శరీరంలో సోడియం చేరకుండా ఇది కాపాడుతుంది.
టమోటా పొడి
టమాటాలను ఎండబెట్టి పొడిలా చేసుకోవచ్చు ఇది రుచిని పోషకాలను అందిస్తుంది దీనిలో ఫైబర్ విటమిన్ సి కూడా ఉంటుంది ముప్పు తగ్గించాక ఎండబెట్టిన టమాటో పొడిని చేర్చుకుంటే రుచి అదిరిపోతుంది గుడ్డు కూరలు చికెన్ కూరల్లో ఈ టమోటా పొడి వేస్తే ఇగురు కూడా బాగా వస్తుంది
వెనిగర్
ఆపిల్ సెడర్ వెనిగర్, వైట్ వెనిగర్, రెడ్ వైన్ వెనిగర్ వంటివి అనేక రకాలు ఉన్నాయి. వీటిని ఉప్పుకు బదులు వాడవచ్చు. సలాడ్‌లపై ఉప్పుకు బదులు వెనిగర్‌ను చల్లుకొని తింటే మంచిది. చిటికెడు ఉప్పు చల్లుకొని వెనిగర్ ను వేసుకుంటే చాలు రుచి అదిరిపోతుంది.
ఒరెగానో
ఒరెగానో మార్కెట్లో లభిస్తుంది. ఉప్పును తగ్గించినప్పుడు రుచి కోసం ఒరెగానో వంటకాలపై చల్లుకోవాలి. ఇది మంచి రుచిని అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఒరెగానోను ఇంట్లో రెడీగా ఉంచుకోండి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో ఇన్ఫ్మేమేషన్‌ను కూడా తగ్గిస్తుంది. ఎండిన వెల్లుల్లి పొడిని తీసి దాచుకుంటే మంచిది. ఉప్పును తగ్గించి ఇలా వెల్లుల్లి పొడిని చల్లుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క పొడిని ఇంట్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే ఎప్పటికప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఉప్పుకు బదులు దీన్ని వేయడం వల్ల మంచి సువాసన, రుచి వస్తుంది. తీపి పదార్థాలు వండినప్పుడు ఉప్పును పూర్తిగా వేయడం మానేసి చిటికెడు దాల్చిన చెక్కను వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్కను ప్రతిరోజు వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
టాపిక్