Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu December 26th Episode: రిషి రౌడీల బారి నుంచి తప్పించుకోవడంతో వసుధారను చంపాలని స్కెచ్ వేస్తాడు శైలేంద్ర. కానీ భద్ర అనే వ్యక్తి వచ్చి వసుధార, అనుపమలను కాపాడుతాడు. మరోవైపు ఓ డెడ్‌బాడీ వద్ద రిషి ఫోన్ పోలీసులకు దొరుకుతుంది. అది రిషి డెడ్ బాడీనా…కాదా ఐడెంటీఫై చేయాలని పోలీసులు వసుధార, మహేంద్రలను పిలుస్తారు.
ట్రెండింగ్ వార్తలు
కానీ ఆ డెడ్ బాడీ రిషిది కాదని తేలుతుంది. మరోవైపు తీవ్ర గాయాలతో ఉన్న రిషికి అటవీ ప్రాంతంలో చెట్ల మందులతో ఇద్దరు వ్యక్తులు ట్రీట్‌మెంట్ ఇస్తుంటారు. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన రిషి…వసుధార అంటూ పిలుస్తాడు. ఆమె పేరును పదే పదే కలవరిస్తుంటాడు. వసుధార అంటే ప్రేమించిన అమ్మాయి అయినా అయిఉండాలి. లేదంటే భార్యనైనా అయిఉండాలని రిషికి ట్రీట్‌మెంట్ ఇస్తున్న వృద్ధులు భావిస్తారు. రిషి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు.
శైలేంద్ర టెన్షన్…
రిషి ఫోన్ చనిపోయిన వ్యక్తి దగ్గర ఎందుకు ఉందో మహేంద్రకు అంతుపట్టదు. అదే విషయం ముకుల్‌కు చెబుతాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఫొటోను సీక్రెట్‌గా తీసి ముకుల్‌కు పంపిస్తాడు. అతడి గురించి తాను ఇన్వేస్టిగేషన్ చేస్తానని మహేంద్రకు మాటిస్తాడు ముకుల్.
రెండురోజుల్లో రిషిని తనకు క్షేమంగా అప్పగించాలని వసుధార ఇచ్చిన వార్నింగ్ గురించి శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. రిషిని తానే కిడ్నాప్ చేసినట్లు వసుధార వద్ద ఉన్న వీడియో సాక్ష్యాన్ని ఆమె ఎక్కడ బయటపెడుతుందోనని కంగారు పడుతుంటాడు. అతడి దగ్గరకు ఫణీంద్ర వస్తాడు.
అనుమానాలు పోవాలంటే….
కాలేజీ ఎండీ సీట్ నీకు దక్కడం కంటే ముందు రిషి ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోవడం ముఖ్యమని శైలేంద్రకు చెబుతాడు ఫణీంద్ర. రిషి విషయంలో మహేంద్ర పడుతోన్న బాధను నువ్వే తీర్చాలని అంటాడు. నీపై మహేంద్ర, వసుధారలకు ఉన్న అనుమానాలు తొలగిపోవాలంటే రిషి ఎక్కడున్నాడో నువ్వే తెలుసుకొని వాళ్లకు అప్పగించమని కొడుకుకు సలహా ఇస్తాడు ఫణీంద్ర.
రిషి ఎక్కడున్నాడో తనకు తెలియదని తండ్రితో అబద్ధం ఆడుతాడు శైలేంద్ర. రిషి అడ్రెస్ తెలుసుకో అది నీ బాధ్యత అని కొడుకుకు గట్టిగా చెబుతాడు ఫణీంద్ర. రిషి విషయంలో మహేంద్ర, వసుధార నిన్ను అనుమానించడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు నిజాయితీ నిరూపణ కావాలంటే రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఈ క్షణం నుంచే రిషి కోసం నువ్వు వెతకాలి అని చెబుతాడు. తండ్రి ముందు కూడా శైలేంద్ర ఇరుక్కుపోతాడు. రిషి ఎక్కడున్నాడో తెలియక తలపట్టుకుంటాడు.
వసుధార ఎమోషనల్…
రిషిని తల్చుకొని వసుధార, మహేంద్ర ఎమోషనల్ అవుతారు. మార్చురీలో రిషి డెడ్‌బాడీ ఎక్కడ కనిపిస్తుందోనని కంగారు పడిన విషయం గుర్తుతెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. రిషి దూరమైతే తన ఊపిరి ఆగిపోయేది అని వసుధార తల్లడిల్లిపోతుంది.
మీరు ఎక్కడున్న క్షేమంగానే ఉంటారని నా మనసు చెబుతుందని తనకు తానే సర్ధిచెప్పుకుంటుంది. మరోవైపు జగతి ఫొటోకు తన మనసులోని బాధ మొత్తం చెప్పుకుంటుంటాడు మహేంద్ర. అసలు రిషి ఎక్కడున్నాడు? ఎందుకు తిరిగిరావడం లేదని ఆవేదనకు లోనవుతాడు. నువ్వు ఎక్కడున్న రిషిని కాపాడుతావనే ధైర్యం నాకు ఉందని జగతి ఫొటోతో అంటాడు మహేంద్ర.
భద్రతో శైలేంద్ర డీల్…
వసుధారను చంపమని తాను డీల్ కుదుర్చుకున్న వ్యక్తి కోసం శైలేంద్ర ఎదురుచూస్తుంటాడు. అప్పుడే అక్కడికి వసుధారను కాపాడిన భద్ర వస్తాడు. తానే ఆ కిల్లర్ అని చెబుతాడు భద్ర. వసుధారను చంపకుండా ఎందుక వదిలివేశావని అతడిపై సీరియస్ అవుతాడు శైలేంద్ర. అతడి కాలర్ పట్టుకుంటాడు. నాతో పాటు బేరం కుదుర్చుకున్న వాళ్లు పోలీసులకు దొరక్కుండా మర్డర్స్ చేయడమే తన స్టైల్ అంటూ శైలేంద్రకు చెబుతాడు భద్ర .
ప్లాన్ ప్రకారమే ముందు వసుధారకు దగ్గరయ్యానని అంటాడు. తాను ఇప్పుడు చేయబోయేది 101వ హత్య అని వివరిస్తాడు. త్వరగా వసుధార అడ్డు తొలగించమని భద్రను రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. ఆ తర్వాత వసుధారతో కలిసి తాను హాస్పిటల్ వెళ్లిన విషయం శైలేంద్రకు చెబుతాడు. మార్చురీలో రిషి ఫోన్ దొరికిన డెడ్‌బాడీ ఫొటోను శైలేంద్రకు చూపిస్తాడు భద్ర.
శైలేంద్రకు వార్నింగ్…
ఆ ఫొటో చూసి శైలేంద్ర షాకవుతాడు. రిషిని కిడ్నాప్ చేయమని తాను డీల్ కుద్చుకున్న రౌడీ ఫొటో కావడంతో అతడి టెన్షన్ మరింత పెరుగుతుంది. రౌడీ చనిపోయాడంటే రిషి తప్పకుండా బతికే ఉంటాడని అనుకుంటాడు. రిషిని కూడా చంపమని భద్రతో చెబుతాడు శైలేంద్ర. అతడి ఫొటో కూడా చూపిస్తాడు. శైలేంద్ర డీల్‌కు ఒప్పుకుంటాడు భద్ర. తన కాలర్ పట్టుకున్నందుకు శైలేంద్రకే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.