TTD Board Meeting : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- జీతాలు పెంపు, ఇళ్ల స్థలాలపై బోర్డు కీలక నిర్ణయాలు

Best Web Hosting Provider In India 2024

TTD Board Meeting : తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. తిరుమల కల్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ (గుండుకు ఇంత లెక్కన) పని చేస్తున్న క్షురకులకు ఎవ్వరూ ఊహించని విధంగా జీతం నిర్ణయించారు. వీరికి నెలకు రూ.20 వేలు కనీస వేతనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుమారు 250 కుటుంబాలకు ఎంతో మేలు జరుగనుంది. కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై పీస్ రేట్ క్షురకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

పోటు కార్మికులకు జీతం పెంపు

టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు రూ.10 వేల జీతం పెంచుతూ నిర్ణయం టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 350 కుటుంబాలకు మేలు జరుగుతుంది. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి పెద్ద జీయర్ మఠానికి ఏటా 60 లక్షలు, చిన్న జీయర్ మఠానికి ఏటా రూ.40 లక్షల అదనపు ఆర్ధిక సహాయం చేయాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది.

కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంపు

టీటీడీలో ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం రూ.3 వేలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2 వేల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారు. కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ లోని ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత తనదని ప్రకటించిన ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన మాట నిలుపుకున్నారన్నారు. ఎల్లుండి తొలి విడతగా 3518 మంది ఉద్యోగులకు మహతి ఆడిటోరియంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు.

 

ఫిబ్రవరి లోపు ఇళ్ల స్థలాలు పంపిణీ

మరో వారం పది రోజుల్లో ఇంకో 1500 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వానికి 80 కోట్ల రూపాయలు చెల్లించి మరో 350 ఎకరాల భూమి సేకరించి ఫిబ్రవరి లోపు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి పదవీ బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన నాయకత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. మళ్లీ 16 సంవత్సరాల తరువాత భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో టీటీడీ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *