Best Web Hosting Provider In India 2024

పూర్వం సాధువులు భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు కఠోరమైన దీక్ష చేసేవారు. ఇలాంటి కథలు పురాణాల్లో వింటుంటాం. కానీ ఈ ఆధునిక యుగంలో అలాంటి వారు ఉన్నారంటే నమ్మగలమా? ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితి. మన ముందు సాధువులు, స్వాములుగా చెప్పుకొని చాలా మందిని మోసం చేస్తున్నారు. కేవలం డబ్బు మీద వ్యామోహంతో బాబాల అవతారం ఎత్తుతున్నారు. సాధువులు పాటించాల్సిన నియమాలను కచ్చితంగా పాటించేవారు కొందరే కనిపిస్తారు. పూర్వం మాత్రం కఠినమైన నియమాలు పాటించేవారు. అయితే ఈ కాలంలోనూ ఓ సాధువు కఠోర దీక్ష చేస్తున్నారు. ఆయన పేరు అమర్ భారతి.
ట్రెండింగ్ వార్తలు
సుమారు 50 ఏళ్లుగా ఒక చేయి పైకెత్తి అలాగే ఉంచుతున్నారు. చేతిని కిందకు దించరు ఆయన. అమర్ భారతి బాబా గురించి చాలామంది విని ఉంటారు. ఈ రకంగా హార్డ్ ఫాస్ట్ చేస్తున్న ఆయన మనోబలం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమర్ భారతి ఈ రకమైన ఉపవాసం చేయడానికి కారణం ఉంది. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
అమర్ భారతి 1973 వరకు కుటుంబ జీవితంలో ఉన్నారు. వివాహం చేసుకున్నారు. పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మికత వైపు మొగ్గు వెళ్లారు. శివుని ఆరాధించడం, ప్రతిరోజూ శివుని పూజిస్తారు. అయితే ప్రపంచ శాంతి కోసం ఆయన ఒక చేయి పైకి ఎత్తి అలానే దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ రకమైన దీక్షతో శివుని అనుగ్రహం పొందుతామని ఆయన నమ్మకం. అమర్ భారతి కఠినమైన నియమాలు పాటిస్తారు.
నిజానికి మనం 10 నిమిషాలు చేయి పైకి లేపితేనే భుజం, చేతులు నొప్పి అనిపిస్తుంది. కానీ అమర్ భారతి పైకెత్తిన చేయి ఎప్పుడూ కిందికి రాదు. ఈ విషయంలో ఆయన కొన్ని రోజులు బాధపడ్డారు. అయినా అతను తన నిర్ణయం మార్చుకోలేదు, ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు. అలా చేయి పైకి ఎత్తి అలానే అలవాటు అయిపోయింది. ఒకటి రెండుసార్లు చేయికి సమస్యలు కూడా వచ్చాయట. ఆయన చేతికి రక్త ప్రవాహం కూడా ఆగిపోయిందని చెబుతారు
నలభై సంవత్సరాలు గడిచినా.. ఆయన చేతులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చేతులు ఎందుకు పైకి లేపారో కూడా చాలా ఇంటర్వ్యూలలో అమర్ భారతి చెప్పుకొచ్చారు. తాను దేవుడిని ఇంకేమీ అడగనని, మనుషుల మధ్య ఇంత శత్రుత్వం ఎందుకు? ప్రపంచ ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడని, విష్ణువు దానిని కాపాడాడని, ఈ విశ్వాన్ని నాశనం చేసి తిరిగి సృష్టించే పాత్రను శివుడు పోషిస్తాడని అన్నారు. శివుడు రక్షిస్తాడు, ఆయన కోపం వస్తే రుద్రతాండవం చేస్తాడని, శివుడి దయ ఉంటే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని అమర్ భారతి నమ్మకం.