Best Web Hosting Provider In India 2024

Ram Charan – Allu Arjun: మెగా, అల్లు కుటుంబాలు కలిసి క్రిస్మస్ సెలెబ్రేషన్లను గ్రాండ్‍గా జరుపుకున్నాయి. హీరోలతో పాటు కుటుంబ సభ్యులు ఈ పార్టీలో సందడి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా మరికొందరు మెగా హీరోలు, కుటుంబ సభ్యులు ఈ సెలెబ్రేషన్లలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. రామ్‍చరణ్, అల్లు అర్జున్‍ను ఒకే ఫ్రేమ్‍లో చూసిన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట ఇంత మంది మెగా హీరోలను చూసి మురిసిపోతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అల్లు శిరీశ్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ సహా మెగా కుటుంబ సభ్యులు క్రిస్మస్ వేడుకలు కలిసి జరుపుకున్నారు. ఈ ఫొటోలను వరుణ్ తేజ్, నిహారిక ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
బ్లాక్ ఔట్‍ఫిట్‍లో రామ్‍చరణ్, అల్లు అర్జున్ ఈ సెలెబ్రేషన్లలో పాల్గొన్నారు. ఫొటోలో ఇద్దరినీ పక్కపక్కన చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే.. రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ అయ్యాక చెర్రీ చేస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను 2024 సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత దిల్‍రాజు ఇటీవల చెప్పారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ మూవీ షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. పుష్పకు సీక్వెల్‍గా సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ భారీస్థాయిలో రూపొందుతోంది. 2024 ఆగస్టు 15వ తేదీ ఈ చిత్రం రిలీజ్ కానుంది. పుష్ప 2 కోసం సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 16న విడుదల కానుంది.