Best Web Hosting Provider In India 2024

Actor Vishal: తమిళ నటుడు విశాల్ తన మిస్టరీ గర్ల్ గురించి నోరు విప్పాడు. న్యూయార్క్ వీధుల్లో ఆ అమ్మాయితో కలిసి వెళ్తూ కెమెరాను చూడగానే పారిపోయిన వీడియో వైరల్ కావడంతో దాని వెనుక ఉన్న అసలు విషయం సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించాడు. అదంతా ఉత్తదే అని, తన కజిన్స్ చేసిన సరదా వీడియో అని అతడు చెప్పడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
క్రిస్మస్ రోజు న్యూయార్క్ లో విశాల్.. ఓ అమ్మాయితో కలిసి న్యూయార్క్ రోడ్లపై నడుచుకుంటూ వెళ్లిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది విశాలే కదా అంటూ ఆ వీడియో తీస్తున్న వ్యక్తి అనడం, అది విని తన ముఖాన్ని షర్ట్ తో దాచుకుంటూ విశాల్ పారిపోవడంతో ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ట్రై చేశారు.
అదో సరదా వీడియో అంతే..
మొత్తానికి ఈ వీడియో వెనుక ఉన్న సీక్రెట్ ను విశాలే బుధవారం (డిసెంబర్ 27) రాత్రి సోషల్ మీడియా ఎక్స్ ద్వారా బయటపెట్టాడు. అదంతా ఉత్తదే అని, సరదా వీడియో అని చెప్పాడు. “సారీ గాయ్స్. ఈ మధ్య వచ్చిన వీడియో వెనుక నిజమేంటో చెప్పాల్సిన సమయం వచ్చేసింది. అందులో సగం నిజం ఉంది. నేను న్యూయార్క్ లోనే ఉన్నాను.
నా కజిన్స్ తో కలిసి ప్రతి ఏటా చివర్లో న్యూయార్క్ వెళ్లి సేదదీరడం నాకు అలవాటు. మరో సగం నిజం ఏంటంటే.. అదో సరదా వీడియో. నా కజిన్స్ క్రిస్మస్ రోజు ఓ ప్రాంక్ చేశారు. వాళ్లే దీనికి కర్త, కర్మ, క్రియ. ఎప్పుడూ నాలోని చిన్న పిల్లాడిని బయటకు తీసుకురావాలని అనుకుంటాను. అందుకే ఆ వీడియో చేశాను. మీ పుకార్లకు ఇక చెక్ పెట్టండి. కొందరు మాత్రం ఇది సరదా వీడియో అని ముందే గుర్తించారు” అని విశాల్ చెప్పాడు.
ఈ మధ్యే మార్క్ ఆంటోనీ సినిమాలో నటించిన విశాల్.. తర్వాత రత్నం అనే మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాను హరి డైరెక్ట్ చేస్తున్నాడు. తుప్పరివాలన్ సీక్వెల్ లోనూ అతడు నటించబోతున్నాడు. ఈ మూవీకి మిస్కన్ నుంచి దర్శకత్వ బాధ్యతలను కూడా విశాలే స్వీకరించాడు.
టాపిక్