Best Web Hosting Provider In India 2024
28 Dec 2023 3:21 PM

తాడేపల్లి: జిల్లా కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ పెన్షన్ కానుక, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం వైయస్.జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.
సమీక్షలో ఉపముఖ్యమంత్రి(ఎక్సైజ్‌శాఖ) కె నారాయణస్వామి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి. ఇంతియాజ్, మెప్మా మిషన్ డైరెక్టర్ వి విజయలక్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.